కరోనా వైరస్ కట్టడి చేసేందుకు..దశల వారీగా లాక్ డౌన్ కు ముగింపు పలికేందుకు కేంద్రం సిద్ధమౌతోంది. 2020, మే 12వ తేదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలను చేశారు.
అందులో భాగంగా బ్లు ప్రింట్ ను రూపొందించాలని సూచించడంతో ఏపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. బ్లూ ప్రింట్ రూపకల్పనకు రంగాల వారీగా ఆరు కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
లాక్ డౌన్ ముగింపు తర్వాత..ఎలా ముందుకెళ్లాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? తదితర వాటిపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌తో బ్లూప్రింట్‌లను నివేదికల రూపంలో రూపొందించాలని ఆదేశించింది ప్రభుత్వం. 2020, 13వ తేదీ బుధవారం మద్యాహ్నం 3 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ కు సమర్పించాలని స్పష్టంగా వెల్లడించింది.
కమిటీల వివరాలు : పబ్లిక్ కార్యకాలపాలపై జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ నేతృత్వంలో రవాణ – రహదారులు – భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా కమిటీ. వ్యవసాయ అనుంబంధ కార్యకలాపాలు, గ్రామీణాభివృద్ధి కార్యకాలపాలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్ నేతృత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, మార్కెటింగ్ కమిషనర్, వ్యవసాయ కమిషనర్, మార్క్‌ఫెడ్ ఎండీ, ఉద్యాన కమిషనర్, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి, పశుసంవర్థక శాఖ డైరెక్టర్, మత్స్యశాఖ కమిషనర్ సభ్యులుగా కమిటీ.
పరిశ్రమల శాఖ ప్రత్యేక సీఎస్ నేతృత్వంలో కార్మిక శాఖ కమిషనర్, పరిశ్రమల డైరెక్టర్, ఫ్యాక్టరీల డైరెక్టర్ సభ్యులుగా కమిటీ. ప్రజా రవాణా కార్యకలాపాలపై రవాణా – రహదారులు – భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో APSRTC ఎండీ, రవాణా శాఖ కమిషనర్ సభ్యులుగా కమిటీ. పట్టణ ప్రాంతాల్లో కార్యకలాపాలపై రెవెన్యూ (వాణిజ్య పన్నులు) ప్రత్యేక సీఎస్ నేతృత్వంలో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సభ్యులుగా కమిటీ.
గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలపై రెవెన్యూ (వాణిజ్య పన్నులు) ప్రత్యేక సీఎస్ నేతృత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా కమిటీ. పరిశ్రమల శాఖ ప్రత్యేక సీఎస్ నేతృత్వంలో కార్మిక శాఖ కమిషనర్, పరిశ్రమల డైరెక్టర్, ఫ్యాక్టరీల డైరెక్టర్ సభ్యులుగా కమిటీ.