Lokesh
Lokesh : ప్రజల కోసం పోరాడుతుంటే వైసీపీ సర్కారు తమపై కేసులు పెడుతోందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని పార్టీ ఆఫీస్ లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ” జైలుకెళ్లడానికైనా మేం రెడీ. నేనేం దేశాన్ని దోపిడీ చేసి జైలుకెళ్లడం లేదు. పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డ సీఐని.. కాఫీ, టీ ఇచ్చి పంపితే హత్యాయత్నం కేసు పెట్టారు. వాళ్లు మా కార్యకర్తల తలలు పగులకొడితే పెట్టీ కేసు పెట్టారు” అని లోకేశ్ అన్నారు.
ఓ కేబినెట్ మంత్రి ఏపీలోని తల్లుల పట్ల అమర్యాదగా మాట్లాడారని ఆరోపించారు లోకేశ్. మైదుకూరు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు.. హత్యకు ప్రేరేపించడం కాదా.. అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన రోజు తాము రెచ్చగొడితే డీజీపీ ఆఫీస్ ఉండేదా..? అని అన్నారు.
Read This : పట్టాభికి 14 రోజుల రిమాండ్.. మచిలీపట్టణం జైలుకు తరలింపు
తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయమని వైసీపీ ఫిర్యాదు చేస్తే చేసుకోనివ్వండి… తమకు ఎటువంటి నష్టం లేదన్నారు లోకేశ్. టీడీపీ కార్యకర్తలు రోడ్ మీదకొస్తున్నారనీ… వారిని భయపెట్టేందుకే దాడులు చేస్తున్నారని లోకేశ్ అన్నారు.
కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఏపీలో పోలీసింగ్ దెబ్బతిందని… పోలీసింగ్ దెబ్బతినడం వల్లే గంజాయి సాగు, సరఫరా పెరుగుతోందని చెప్పారు. గంజాయి సాగు, సరఫరా పెరుగుతున్నా కూడా వైసీపీ సర్కారు కట్టడి చేయడం లేదన్న లోకేశ్… డ్రగ్స్ కట్టడి చేయకపోతే ఓ జనరేషన్ దెబ్బ తింటుందని చెప్పారు.
Read This : CM Jagan on TDP: టీడీపీపై జగన్ సీరియస్.. పోలీసులు ఎవర్నీ వదలొద్దన్న ఏపీ సీఎం..!
బద్వేలు ఉపఎన్నికలో పోటీ లేకుండా సహకరించాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కోరడం వల్లే టీడీపీ బరినుంచి తప్పుకుందని చెప్పారు లోకేశ్. స్ట్రాటజీలతో గెలిచేది వైసీపీనే అన్నారు. వైసీపీకి పీకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా మారారన్నారు. త్వరలోనే టీడీపీ టీమ్ ఢిల్లీకి వెళ్తుందని… డ్రగ్స్, గంజాయి గురించి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి విషయాన్ని ప్రస్తావిస్తామన్నారు. చంద్రబాబు .. అమిత్ షాకు ఫోన్ చేశారో.. లేదో.. సజ్జలే హోంమంత్రికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చుగా..? అని చెప్పారు లోకేశ్. వైసీపీ ఇంకా ఇదే విధంగా రెచ్చగొట్టినా.. దాడులు చేసినా చూస్తూ ఊరుకోం.. తలలు పగులుతాయని హెచ్చరించారు లోకేశ్.