Mission Begin Again : జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు..!

  • Publish Date - June 29, 2020 / 04:14 PM IST

మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు మరోసారి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నెల పూర్తి వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటిస్తున్నట్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు…‘#Mission Begin Again’ అనే పేరుతో కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

ప్రత్యేకించి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని పరిసరాల్లోనే అనవసర కార్యకలాపాలను పరిమితం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా 5.48 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే… ఒక్క మహారాష్ట్రలోనే 1,64,626 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 86,575 మంది కోలుకున్నారు. మరో 7,429 మంది మృతిచెందారు. ప్రస్తుతం 70,622 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా కేసులు సంఖ్య పెరిగాయి. ఇప్పటికే పలు నగరాల్లో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

షాపింగ్, బహిరంగ వ్యాయామాలు వంటి అనవసరమైన కార్యకలాపాలతో పాటు వ్యక్తుల కదలికలు, మాస్క్‌లు, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, అవసరమైన అన్ని నిర్దేశిత తప్పనిసరి జాగ్రత్తలతో పొరుగు ప్రాంతాల్లోనూ పరిమితులు విధించాలని నిర్దేశించినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. కార్యాలయాలు, అత్యవసర పరిస్థితులకు హాజరయ్యే వారికి మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

పని ప్రదేశానికి హాజరు కావడానికి, వైద్య కారణాలతో సహా బోనఫైడ్ మానవతా అవసరాలకు మాత్రమే ‘unrestricted movement’ అనుమతి ఉండేలా ప్రభుత్వం నిర్దేశాల్లో పేర్కొంది. నిత్యావసరమైన దుకాణాలు, అవసరమైన, అవసరం లేని వస్తువులకు ఇ-కామర్స్ కార్యకలాపాలు, ప్రస్తుతం పనిచేస్తున్న అన్ని పారిశ్రామిక యూనిట్లు, ఆహారాన్ని పంపిణీ చేసేందుకు అనుమతించనుంది.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు (అత్యవసర, ఆరోగ్య, వైద్య, ట్రెజర్, విపత్తు నిర్వహణ, పోలీసు, ఎన్ఐసి, ఆహారం, పౌర సరఫరా, NIC, food and Civil Supply, FCI, NYK, Municipal Services మినహా) 15శాతం మంది లేదా 15 మంది వ్యక్తులతో పనిచేసేలా అనుమతి ఇచ్చింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని అన్ని ప్రైవేట్ కార్యాలయాలు 10శాతం మంది లేదా 10 మందితో పనిచేయాల్సి ఉంటుంది.

ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, తెగులు నియంత్రణ వంటి స్వయం ఉపాధి వ్యక్తులకు సంబంధించితో పాటు గ్యారేజీలు, వార్తాపత్రికల ప్రింటింగ్, పంపిణీ, MMRలో బార్బర్ షాపులను కూడా అనుమతించారు. COVID-19 ను పరిష్కరించడంలో పురోగతి ఉన్నప్పటికీ, సంక్షోభం ఇంకా ముగియలేదని, నిబంధనలను పాటించాలని, లాక్ డౌన్ తిరిగి విధించబడకుండా చూసుకోవాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే సూచనలు చేశారు.

Read:మాకు కావాల్సింది గొప్పలు కాదు.. ప్రాణాలు కాపాడటమే: కేజ్రీవాల్

ట్రెండింగ్ వార్తలు