Peacock feather smuggling : ప్రమాదంలో జాతీయ పక్షి.. చైనాకు నెమలి ఈకలు!

విశ్వంలోని అందాన్నంతా తనలో దాచుకున్న నెమలిని భారతప్రభుత్వం జాతీయ పక్షిగా ప్రకటించింది. కానీ మన జాతీయ పక్షికి అంతర్జాతీయ మార్కెట్ లో గల డిమాండ్ తో అక్రమార్కుల కన్ను నెమలిపై పడింది. వివిధ మార్గాల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నెమలి ఈకలను ఇతర దేశాలకు అక్రమ ఎగుమతి చేస్తున్నారు.

Peacock feather smuggling: ఈ సృష్టిలో ప్రకృతి ఎంత గొప్పదో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మన ప్రకృతి రమణీయత ఎంతటిదో తెలియాలంటే ఒక్కక్షణం నెమలిని చూస్తే అర్థమవుతుంది. నెమలి నాట్యం చేస్తుంటే ఆ దృశ్యం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. అలా విశ్వంలోని అందాన్నంతా తనలో దాచుకున్న నెమలిని భారతప్రభుత్వం జాతీయ పక్షిగా ప్రకటించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నెమలికి అంతటి ప్రాధాన్యత ఇస్తున్న మన ప్రభుత్వం.. ఈ పక్షికి హానికలిగిస్తే కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చింది. కానీ మన జాతీయ పక్షికి అంతర్జాతీయ మార్కెట్ లో గల డిమాండ్ తో అక్రమార్కుల కన్ను నెమలిపై పడింది. వివిధ మార్గాల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నెమలి ఈకలను ఇతర దేశాలకు అక్రమ ఎగుమతి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అక్రమంగా తరలిస్తున్న 21 లక్షల నెమలి ఈకలను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ నెమలి ఈకలను చైనాకు అక్రమంగా తరలిస్తున్నట్లుగా నిర్ధారించుకున్న అధికారులు ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలకు దిగారు. M/s గెలాక్సీ రైడర్ సంస్థ, దాని డైరెక్టర్ అయాజ్ అహ్మద్ మరియు మరికొందరిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పలు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పరిధిలోని ఐసీడీ తుగ్లకాబాద్ వద్ద ఈకల పార్సిళ్లను పట్టుకోగా మొత్తం 2,565 కిలోల బరువున్న 77 ప్యాకేజీలలో 21 లక్షల నెమలి ఈకలున్నట్లుగా గుర్తించారు. న్యూఢిల్లీ కస్టమ్స్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్న తరువాత సీబీఐ కేసు నమోదు చేసింది.

సీజ్ చేసిన ఈకల విలువ రూ. 5.25 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తుండగా వైద్యం కోసం చైనీయులు నెమలి ఈకలను వాడుతుటారని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. M/s గెలాక్సీ రైడర్ సంస్థ ప్లాస్టిక్ ఫ్లెక్సిబుల్ పైపులు పేరిట ఈ సరుకును రవాణా చేసినట్లు సీబీఐ వర్గాలు తేల్చగా గత ఏడాది సెప్టెంబరు నుండి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య ఇదే పద్ధతిలో ఇలాంటి 26 కన్సైన్ మెంట్ సరుకులను చైనాకు పంపినట్లు దర్యాప్తులో తేల్చారు.

Peacock Feathers Smuggled To China

అక్రమ రవాణా దారులు ఈకలను ఎలా పొందారు?
సీబీఐ దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న ఈకలు నెమళ్ళను వేటాడటం ద్వారా సేకరించినవేనని చెప్తున్నారు. ఇది భారీ క్రిమినల్ నెట్‌వర్క్‌లో భాగం కాగా వేటాడటంలో మినహా ఇంత పెద్ద మొత్తంలో ఈకలను పొందడం సాధ్యం కాదని ఒక అధికారి తెలిపారు. M/s గెలాక్సీ రైడర్ సంస్థ.. లాజిస్టిక్ క్యూరేటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేవలను ఉపయోగించి ఈకలను ప్యాక్ చేసి ఎగుమతి చేస్తుందని సీబీఐ ఆరోపించింది.

నెమళ్ళను రక్షించడం ఎందుకు ముఖ్యం?
వన్యప్రాణి రక్షణ చట్టం, 1972 యొక్క షెడ్యూల్ 1 ప్రకారం మన జాతీయ పక్షి నెమలికి ఏ పౌరుడు హానిగలిగించకూడదు. దీనిని వేటాడం పూర్తిస్థాయి నిషేధం. నెమలి ఈకలను కూడా ఎలాంటి ఎగుమతి చేయడానికి అనుమతి లేదు. కస్టమ్స్ యాక్ట్, 1962 u/s 113 (డి) ప్రకారం నెమలి ఈకలను ఎగుమతి చేయడం కూడా తీవ్రమైన నేరం. అయితే.. కాసులకు కక్కుర్తి పడే ఈ సంస్థ.. దాని డైరెక్టర్, మరియు కొంతమందితో కలిసి ఈ అక్రమ రవాణాకు తెగబడినట్లుగా అధికారులు తేల్చారు.

ట్రెండింగ్ వార్తలు