‘నూటొక్క జిల్లాల అందగాడు’.. వస్తున్నాడు..

Nootokka Zillala Andagaadu: కమర్షియల్ సినిమాలతో పాటు, మీడియం స్టార్ట్స్‌తో కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’.. ప్రముఖ నటుడు నూతన్ ప్రసాద్ పాపులర్ డైలాగ్‌నే టైటిల్‌గా పెట్టారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సమర్పణలో, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రె.లి, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

నటుడిగా, రచయిత, దర్శకుడిగా ఆకట్టుకున్న శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తున్నారు. ‘చి.ల.సౌ’, ‘హిట్’, ‘డర్టీ హరి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రుహానీ శర్మ కథానాయిక. రాచకొండ విద్యా సాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి శ్రీనివాస్ అవసరాల రచయితగా పని చేస్తుండడం విశేషం. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

వేసవి కానుకగా మే 7న ‘101 జిల్లాల అందగాడు’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి కెమెరా : రామ్, ఎడిటింగ్ : కిరణ్ గంటి, సంగీతం : శక్తి కాంత్ కార్తీక్, ఆర్ట్ : రామాంజనేయులు, నిర్మాతలు : శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి.

ట్రెండింగ్ వార్తలు