Ntr To Give Twist To Koratala
NTR: టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా జోరుగా సాగుతోంది. గతేడాది చివర్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప – ది రైజ్’ సినిమా ఇండియావైడ్‌గా రిలీజ్ అయ్యి అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఆ తరువాత భారీ అంచనాల నడుమ ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ తాజాగా రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత కూడా బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా చిత్రాల జాతర సాగనుంది.
ఈ నెల 25న మోస్ట్ వెయిటెడ్ మూవీగా ఆర్ఆర్ఆర్ రానుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తరకెక్కించగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి మేటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ట్రిపుల్ ఆర్’ తరువాత కూడా తన నెక్ట్స్ చిత్రాలను పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.
RRR: ప్రమోషన్స్‌తో దూసుకుపోనున్న ఆర్ఆర్ఆర్ టీమ్
ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా చేయాలని ఆయన చూస్తున్నాడు. ఇక ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయకముందే, తన నెక్ట్స్ మూవీని ‘ఉప్పెన’ ఫేం దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో చేసేందుకు సిద్ధమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించేందుకు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాక ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశాడట. ఇక ఈ మూవీలో తారక్ పాత్ర పేరు ‘పెద్ది’గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కథలో తారక్ ఓ అథ్లెట్‌గా మనకు కనిపిస్తాడట. యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సిద్ధమవుతున్నారు.
RRR : ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ మొదలు.. ‘ఎత్తరా జెండా’ అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం..
అయితే కొరటాలతో తారక్ తన 30వ చిత్ర షూటింగ్ ప్రారంభించక ముందే ‘పెద్ది’ చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను తారక్, కొరటాల శివతో తీయబోయే సినిమాకంటే ముందే తెరకెక్కిస్తారా లేక రెండు సినిమాలను ఒకేసారి చిత్రీకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకే బుచ్చిబాబు ప్లాన్ చేయడంతో కొరటాలకు తారక్ ఝలక్ ఇస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది.