RRR: ప్రమోషన్స్‌తో దూసుకుపోనున్న ఆర్ఆర్ఆర్ టీమ్

ఎన్నో రోజులుగా ఊరిస్తూ వస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

RRR: ప్రమోషన్స్‌తో దూసుకుపోనున్న ఆర్ఆర్ఆర్ టీమ్

Rrr To Do Aggressive Promotions

ప్రస్తుతం టాలీవుడ్‌లో మళ్లీ సినిమాల సందడి షురూ అయ్యింది. ఎన్నో రోజులుగా ఊరిస్తూ వస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించడంతో జనం రాధేశ్యామ్ కోసం థియేటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ కావడంతో ఇది బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా ధీమాగా ఉన్నారు. ఇక రాధేశ్యామ్ చిత్రానికి వస్తున్న క్రేజ్‌ను చూశాక మరో భారీ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కూడా అంతే స్థాయిలో జనాల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆర్టిస్టుల పారితోషికాలు ఎంతో తెలుసా??

గతంలోనే ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో నిర్వహించిన చిత్ర యూనిట్, ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి వాయిదా పడటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈసారి సినిమా రిలీజ్‌‌లో ఎలాంటి మార్పు లేదని చిత్ర యూనిట్ అంటోంది. అంతేగాక మరోసారి సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘ఎత్తరా జెండా’ అనే పాటను మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్, ఈ సాంగ్ రిలీజ్ తరువాత సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్స్‌ను దుబాయ్ మరియు బెంగళూరులో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ క్రమంలో పలు ప్రాంతీయ, జాతీయ మీడియా ఛానళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచాలని టీమ్ భావిస్తుంది. ఇక ఈ సినిమాతో కేవలం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ తమ జోరును చూపించాలని వారు భావిస్తున్నారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ మొదలు.. ‘ఎత్తరా జెండా’ అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం..

రాధేశ్యామ్ రిజల్ట్ ఆర్ఆర్ఆర్ మూవీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా రాధేశ్యామ్ సినిమాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చి సినిమా బ్లాక్‌బస్టర్ అయితే, అది ఆర్ఆర్ఆర్‌కు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ రెడీ అవుతోంది.