ఇక ట్విట్టర్ టిక్‌మార్క్ అందరికి రావొచ్చు.. ఇన్-యాప్ వెరిఫికేషన్ సిస్టమ్‌పై కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

  • Publish Date - June 9, 2020 / 12:49 PM IST

ప్రముఖ సోషల్ బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొత్త ఇన్ యాప్ వెరిఫికేషన్ సిస్టమ్ డెవలప్ చేస్తోంది. దీని ద్వారా వెరిఫికేషన్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ట్విట్టర్ ధ్రువీకరించిందని రివర్స్ ఇంజినీర్ Jane Manchun Wong తమ విశ్లేషణలో గుర్తించారు. ‘Request Verification’ ఆప్షన్ యాడ్ అయింది. రీడిజైన్డ్ అకౌంట్ సెట్టింగ్స్ స్ర్కీన్ లోనే ఈ ఆప్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ పబ్లిక్ లోకి లాంచ్ చేయలేదని ట్విట్టర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పాపులర్ సోషల్ యాప్స్ అందించే ఫీచర్లలో కొత్త మార్పులు ఏం ఉండబోతున్నాయో వాంగ్ వివరణ ఇస్తున్నారు. ఎప్పటినుంచో ట్విట్టర్ యూజర్లు అడుగుతున్న ఫీచర్.. ఎడిట్ బటన్. అలాగే బ్లూ చెక్ మార్క్ తిరిగి మళ్లీ పబ్లిక్ ఫిగర్ లలోకి రానున్నాయనే సంకేతాలు ఇచ్చారు. 

కొన్ని ఏళ్లుగా ట్విట్టర్ వెరిఫికేషన్ సిస్టమ్ విషయంలో వినియోగదారుల్లో కన్ఫూజన్ ఉంది. హైప్రొఫైల్ అకౌంట్లకు కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్నిసార్లు ఇబ్బందికర సమస్యలు తలెత్తాయి. బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అర్థానికి చెక్ మార్క్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2017లో ఈ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. Jason Kessler అనే నిర్వాకుడి ట్విట్టర్ ఖాతాకు వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఇచ్చింది. దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆధారంగా సిస్టమ్ ఆయా అకౌంట్లకు వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఇష్యూ చేస్తుందని కంపెనీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

కానీ, విమర్శకులు మాత్రం వెరిఫికేషన్ చేయకుండా ఎవరికి బ్యాడ్జ్ ఇవ్వరాదని గట్టిగా వాదించారు. అప్పటినుంచి ట్విట్టర్ వెరిఫికేషన్లను నిలిపివేసింది. 2018 తర్వాత ట్విట్టర్ వెరిఫికేషన్లను నిలిపివేసింది. కానీ, మొత్తం నిలిపివేయలేదు. 2018 అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలోనూ క్వాలిఫైయిడ్ అభ్యర్థులకు మాత్రమే అనుమినిచ్చింది. ఎన్నికైన అధికారులకు కూడా వెరిఫికేషన్ కొనసాగించింది. 

ఇటీవలే ట్విట్టర్ వైద్య నిపుణులకు కూడా వెరిఫికేషన్ అథారిటీ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ రిక్వెస్ట్ వెరిఫికేషన్ ఆప్షన్ వ్యక్తిగత యూజర్లు అందరికి తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ట్విట్టర్ ప్లాన్ చేస్తోంది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారమే ఈ కొత్త సిస్టమ్ లైవ్ లోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. దీనికి సంబంధించి వర్క్ కొనసాగుతోందని, త్వరలోనే వెరిఫికేషన్ సిస్టమ్ రీవ్యాంప్ చేయనున్నట్టు ట్విట్టర్ స్పష్టం చేసింది.