అమ్మ అడ్వంచర్ కు వరల్డ్ రికార్డ్స్‌..కళ్లకు గంతలు కట్టుకుని 155 అడుగుల పర్వతంపై నుంచి సాహసం

Tamilnadu two children mother world record : ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఇద్దరు పిల్లల తల్లి ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసి ఔరా..అనిపించింది. తాము ఎందులోనూ తక్కువ కాదని మహిళలు నిరూపిస్తున్నా..వారు శారీరకంగా బలహీనులనే భావం పోవటంలేదు. అందునా పిల్లల తల్లి అయితే ఇంకా బలహీనంగా ఉంటుందనే భావం కూడా ఉంది. ఈక్రమంలో ఇద్దరు పిల్లల తల్లి అయిన 23 ఏళ్ల మహిళ ఏకంగా..‘‘155 అడుగుల ఎత్తయిన పర్వతం నుంచి 58 సెకెన్లలో కిందకు దిగి ప్రపంచ రికార్డు’’ సృష్టించింది.

తమిళనాడుకు శ్రీపెరుంబుదూర్ ప్రాంతంలో ముథామిల్ సెల్వీ అనే మహిళ చేసిన సాహసాన్ని చూస్తే ఔరా అనకుండా ఉండలేం. 23 ఏళ్ల సెల్వీ ఇద్దరు పిల్లల తల్లి కావటం మరో విశేషం. సెల్వీ కళ్లకు గంతలు కట్టుకుని, 155 అడుగుల ఎత్తయిన పర్వతం నుంచి 58 సెకెన్లలో కిందకు దిగి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ముథామిల్ సెల్వీ మీడియాతో మాట్లాడుతూ ఒక భారతీయ మహిళగా..ఇద్దరు పిల్లలకు తల్లిని అయిన నేను ఏదోక సాహాసం చేయాలనే తపన ఉండేది.

దీని కోసం 155 అడుగుల ఎత్తయిన పర్వతం మీద నిలుచుని, కళ్లకు గంతలు కట్టుకుని, అంతెత్తు నుంచి అవలీలగా కిందకు దిగి మహిళా శక్తిని చాటానని..మహిళలు తలచుకంటే ఏదైనా చేయగలరని నిరూపించటానికే ఇలా చేశానని తెలిపారు సెల్వీ. పురుషులతో సమానంగా మహిళలు ఏ పనినైనా చేయగలరని, మహిళల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకే తాను ఈ సాహసం చేశానని సెల్వీ తెలిపారు. సెల్వీ చేసిన ఈ అడ్వేంచర్.. యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.