Man Talaq..wife Black Colour : భార్య నల్లగా ఉందని తలాక్ చెప్పాడు..డబ్బులిస్తే తెల్లగా కనిపిస్తుందేమో..

కారు కొనటానికి డబ్బులు తీసుకురాను అని చెప్పిన భార్యకు తలాక్ చెప్పాడు భర్త. నల్లగా ఉన్నావు..నువ్వు నాకొద్దు అంటూ తలాక్ అని చెప్పి ఇంట్లోంచి గెంటివేశాడు.

Husband Gives Divorce To His Wife For Black Colour

Husband gives divorce to his wife for black colour : డబ్బు పిచ్చిన భర్త భార్యను ఎలాగైనా వదిలించుకోవాలనుకునే బర్త దేనికైనా దిగజారతాడు అనటానికి మరో ఉదాహకరణగా నిలిచాడో భర్త. పెళ్లి అయి ఏడాది కూడా పూర్తి కాలేదు. అన్ని కట్నకానుకలతో ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి వచ్చిన ఓ ముస్లిం ఆడపడుచుకి చుక్కలు చూపించారు భర్త అత్తింటివారు కలిసి. పెళ్లి అయిన తొమ్మిది నెలలకే ఇంకా డబ్బులు తీసుకోరావాలని వేధించారు. కారు కొనుక్కోవాలి మీ పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మన్నాడు భర్త. అడగను అని చెప్పింది. భార్య. దానికి అతనికి అప్పటిదాకా భార్య నల్లగా ఉంటుందని తెలీదనుకుంటా..పెళ్లి చేసుకన్నప్పుడు నల్లగా ఉందని అత్తింటివారిచ్చే కట్నకానుల ముందు భార్య నల్లగా ఉంటుందని కనిపించలేదనుకుంటారు. చక్కగా అన్ని లాంఛనాలతో భారీగా ఇచ్చిన కట్టంతో చక్కగా పెళ్లి చేసుకున్నాడు. తరువాత కారు కొనుక్కోవటానికి భార్య డబ్బులు తీసుకురాను అని చెప్పేసరకి హఠాత్తుగా ఆ భర్తకు భార్య నల్లగా ఉందని తెలిసొచ్చింది. దీంతో నువ్వు నల్లగా ఉన్నావు..నువ్వు నాకొద్దు అంటూ ‘తలాక్ తలాక్ తలాక్’ అని చెప్పేశాడు. ఇక నీకూ నాకు విడాకులు అయిపోయాకు ఇంటిలోంచి పొమ్మన్నాడు. దాంతో సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read more : Gifts Taj Mahal to wife : మరో షాజహాన్..భార్యకు తాజ్‌మహల్‌ కట్టి గిఫ్టు

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో భర్తపై బాధితురాలు కేసు పెట్టింది. తమ వివాహం జరిగి తొమ్మిది నెలలు అయ్యిందని అప్పటి నుంచి తన అత్తింటివారు, భర్త కలిసి తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేక్కొంది. తాను నల్లగా ఉన్నానని తన భర్త, అత్తింటివారు తనను హేళన చేస్తున్నారని, మాటలతోనే చేతలతో హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలికి గత మార్చి 7న ఆలం అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం సమయంలో కట్నంగా మూడు ఎకరాలు భూమి ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కావాలంటూ భర్త, అత్తింటివారు వేధించేవారు. అన్ని ఓర్చుకుని ఉండేది. కానీ వారు ఊరుకోలేదు. మీ నాన్నకు ఇంకా ఆస్తులున్నాయి కదా..అవి అమ్మి డబ్బులు లేవాలని వేధించారు. ఆ డబ్బులు తెస్తే మనం చక్కగా కారు కొనుక్కోవచ్చని భార్యను పోరేవాడు. కానీ ఆమె వివాహం చేసి ఏడాది కూడా కాలేదు.మళ్లి ఏమొహం పెట్టుకుని డబ్బులు అడగాలి..కారు కొనుక్కోవాలంటే మనమే కష్టపడి కొనుక్కుందాం అని చెప్పేది.

Read more  : AP Floods : వరద ప్రభావిత జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

కానీ..అలా కుదరని మీ నాన్నకు వేరే భూములు ఉన్నాయి వాటిని అమ్మి రూ. 10 లక్షలు తీసుకురావాలని…ఆమెను తరచు వేధించేవారు. దీనికి ఆమె నిరాకరించడంతో భర్త కొట్టేవాడు. అత్తగారు కూడా పలుమార్లు కొట్టింది. ఇలాక్కాదనుకున్నారో ఏమోగానీ..మానసికంగా వేధిస్తే దారికొస్తుందనుకున్నారేమో..‘నువ్వు నల్లగా ఉన్నావు..నేను జాలిపడి పెళ్లి చేసుకున్నాను..లేకుంటే నాకు పెళ్లే అవ్వదు..కాపురం నిలవాలంటే నేను కారు కొనుక్కోవటానికి డబ్బు తేవాల్సిందేనని ఒత్తిడి చేశఆడు. కానీ ఆమె ససేమిరా అనేసరికి ఆలం భార్యకు ‘ట్రిపుల్ తలాక్’ చెప్పాడు. ఇక నీకూ నాకూ ఎటువంటి సంబంధం లేదు ఇంటిలోంచి పొమ్మంటే గెంటేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసినట్టు ఇన్స్ పెక్టర్ రాజీవ్ సింగ్ తెలిపారు.