AP Floods : వరద ప్రభావిత జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచే చంద్రబాబు యాక్షన్‌ మొదలుకాబోతోంది.

AP Floods : వరద ప్రభావిత జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu to be visit flood affected areas

AP Floods :  అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచే చంద్రబాబు యాక్షన్‌ మొదలుకాబోతోంది. ఇకపై.. ప్రజాక్షేత్రంలోనే ఉంటానని.. అసెంబ్లీలో శపథం చేసిన బాబు.. వరద ప్రభావిత జిల్లాల నుంచే జనంలోకి వెళ్లనున్నారు. ఇప్పటి నుంచి.. వచ్చే ఎన్నికల దాకా చంద్రబాబుతో పాటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు జనంలో ఉండనున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో.. వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

అసెంబ్లీలో శపథం తర్వాత.. ఈ మంగళవారం నుంచే చంద్రబాబు పబ్లిక్‌లోకి వెళ్తున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని.. బాబు డిసైడ్ అయ్యారు. మంగళవారం నవంబర్ 23, ఉదయం కడప జిల్లాలో.. మధ్యాహ్నం తిరుపతిలో పర్యటిస్తారు. బుధవారం నాడు నవంబర్ 24…. నెల్లూరు జిల్లాలో పర్యటించి.. వరద బాధిత కుటుంబాలు, పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. ఇప్పటికే.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై.. ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని వివరాలు.. అడిగి తెలుసుకున్నారు.

Also Read : Mayor, Chairman Elections : మేయర్, చైర్మన్‌ల ఎన్నిక నేడే

ఈ విపత్కర పరిస్థితుల్లో.. వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలన్నారు బాబు. వరద బాధితులకు ఆహారం, మందులు అందేలా చూడాలని చెప్పారు. చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఇప్పటికే.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ముంపు గ్రామాల్లో సహాయచర్యలు చేపట్టడంతో పాటు.. వరదలో చిక్కుకున్న వారికి మందులు, ఆహారం అందజేసినట్లు తెలిపారు చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. సహాయ సహకారాలు అందిస్తున్న వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. ముంపు ప్రాంతాల్లో.. టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

రాష్ట్రంలో ఎక్కడి సమస్యలపై.. అక్కడే పోరాడాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా జనంలోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలోనే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ నేతలకు.. పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం.. పార్టీ సీనియర్ నాయకులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాల కోసం రూట్ మ్యాప్ ఖరారు చేస్తారని సమాచారం.