Mayor, Chairman Elections : మేయర్, చైర్మన్‌ల ఎన్నిక నేడే

ఈనెల 15న ఎన్నికలు జరిగిన నెల్లూరు నగరపాలకసంస్థ తో పాటు 12 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక ఈరోజు జరుగుతుంది.

Mayor, Chairman Elections :  మేయర్, చైర్మన్‌ల ఎన్నిక నేడే

Local Bodies Elections

Updated On : November 22, 2021 / 8:17 AM IST

Mayor, Chairman Elections :  ఈనెల 15న ఎన్నికలు జరిగిన నెల్లూరు నగరపాలకసంస్థ తో పాటు 12 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక ఈరోజు జరుగుతుంది. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయరు, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు.

Also Read : AP Corona : ఏపీకి బిగ్ రిలీఫ్.. సున్నా కరోనా మరణాలు

ఎన్నికలు జరిగిన మరో 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు అయిన అకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్‌), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు జిల్లా) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికైన  సభ్యులు ఉదయం 11 గంటలకు సమావేశమై చైర్మన్, ఇద్దరు వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు.