AP Corona : ఏపీకి బిగ్ రిలీఫ్.. సున్నా కరోనా మరణాలు

ఏపీకి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. నిన్నటి పోలిస్తే కరోనా కేసులు కాస్త పెరిగినా.. ఒక్క మరణం కూడా నమోదవ లేదు. నిన్న 164 కేసులు నమోదవగా, ఇవాళ

AP Corona : ఏపీకి బిగ్ రిలీఫ్.. సున్నా కరోనా మరణాలు

Ap Corona Cases

AP Corona : ఏపీకి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. నిన్నటి పోలిస్తే కరోనా కేసులు కాస్త పెరిగినా.. ఒక్క మరణం కూడా నమోదవ లేదు. నిన్న 164 కేసులు నమోదవగా, ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 24వేల 659 శాంపిల్స్‌ పరీక్షించగా.. 174 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. కాగా, ఈరోజు కరోనా కారణంగా ఎవరు మరణించ లేదు.

Sonu Sood : వైసీపీ నేతల వైఖరి సరికాదన్న సోనూసూద్.. చంద్రబాబుకి ఫోన్‌లో పరామర్శ

అదే సమయంలో 301 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,78,784 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,244 కు పెరిగింది. ఇక 20,54,553 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. కరోనా మరణాల సంఖ్య 14,426గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,265 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో 31, చిత్తూరులో 29 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా లేదు.

Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. అయినప్పటికి ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. అంతా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని నిపుణులు చెబుతున్నారు. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే.