Sonu Sood : వైసీపీ నేతల వైఖరి సరికాదన్న సోనూసూద్.. చంద్రబాబుకి ఫోన్‌లో పరామర్శ

పలువురు ప్రముఖులు చంద్రబాబుకి సానుభూతి తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు, మానవతావాది సోనూసూద్ కూడా చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారు.

Sonu Sood : వైసీపీ నేతల వైఖరి సరికాదన్న సోనూసూద్.. చంద్రబాబుకి ఫోన్‌లో పరామర్శ

Sonu Sood

Sonu Sood : ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆయన వెక్కి..వెక్కి.. ఏడ్చారు. వైసీపీ నేతలు తన సతీమణి భువనేశ్వరి గురించి నీచంగా మాట్లాడారని చంద్రబాబు వాపోయారు. ఇదే విషయమై నందమూరి ఫ్యామిలీ మొత్తం రియాక్ట్ అయ్యింది. చంద్రబాబుకి అండగా నిలిచింది. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేన్నారు.

అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చంద్రబాబుకి ఫోన్ చేశారు. చంద్రబాబుని ఓదార్చారు. ఈ విషయంలో పలువురు ప్రముఖులు చంద్రబాబుకి సానుభూతి తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు, మానవతావాది, హెల్పింగ్ స్టార్ సోనూసూద్ కూడా చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారు.

Instant Covid Test : కాఫీతో కోవిడ్‌ టెస్ట్‌ చేయొచ్చు… ఇదిగో ప్రాసెస్..!

అసెంబ్లీలో జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు సోనూసూద్. దేవాలయం లాంటి సభలో వైసీపీ నేతల వైఖరి సరికాదని సోనూసూద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని బాబుకు చెప్పినట్లు తెలుస్తోంది.

గతంలోనూ ఎన్నోసార్లు చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు సోనూసూద్. కరోనా బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సాయం చేస్తున్న సమయంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సోనూసూద్ పాల్గొని చంద్రబాబును అభినందించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను తాను ప్రత్యక్షంగా చూశానని అప్పట్లో సోనూసూద్ అన్నారు.

WhatsApp Web Tricks : వాట్సాప్‌ వెబ్‌లో ఈ సూపర్ షార్ట్‌కట్స్‌.. తప్పక తెలుసుకోండి!

తన భార్యకు రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ ఆమెను కూడా చర్చల్లోకి లాగుతున్నారని చంద్రబాబు వాపోయారు. కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. సభలో వైసీపీ సభ్యులు కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సతీమణి గురించి నీచంగా మాట్లాడారని బాధపడ్డారు. ఆమెకు తన గురించి తప్ప మరో ఆలోచన లేదని చెప్పారు. భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదని అన్నారు. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సంక్షోభం వచ్చినా ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. శాసనసభలో అవమానాలను భరించలేకపోతున్నానని… మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన నేరుగా టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. వెక్కి..వెక్కి..ఏడ్చారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి.