Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

ప్రపంచంలో ధనవంతులు ఎప్పుడూ ధనవంతులుగానే ఉండిపోతున్నారు.. పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? ఇందులో ఒక లాజిక్ ఉందన్నారు.

Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

How To Grow Your Wealth To Rs 100 Cr By Investing Rs 10 Lakh

Updated On : November 19, 2021 / 7:57 PM IST

Invest Grow Your Wealth : కోటీశ్వరుడు కావాలనే కోరిక ప్రతిఒక్కరిలోనూ ఉంటుంది. కష్టానికి తోడు అదృష్టం కూడా వెంట ఉండాలంటారు. అది నిజమే.. కానీ, అందుకు తగినట్టుగా ఆర్థికపరంగా ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే పోయే ప్రతి రూపాయిపై ఒక నిర్దిష్ట ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. బడ్జెట్ అంచనా వేసుకోగలగాలి. అప్పుడే మీరు ఎంత సంపాదిస్తున్నారు.. ఎంత మొత్తంలో ఖర్చు పెడుతున్నారో తెలుస్తుంది. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించడానికే జీవితం మొత్తం సరిపోతుంది. ఇక ధనవంతులయ్యేది ఎప్పుడు.. ఆ కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని ఆవేదన చాలామందిలో ఉంటుంది. మీ సంపాదన మొదలైనప్పటి నుంచి రిటైర్ అయ్యేనాటికి మీరు ఎంత సంపాదించారు.. ఎంత మొత్తంలో కూడబెట్టారు అనేది బెరీజు వేసుకోవాలి. తక్కువ సమయంలోనే కోట్లు గడించాలని చాలామంది షార్ట్ కట్ మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. వాస్తవానికి ఇది చాలా డేంజర్ స్టెప్ అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.. కొంచెం అటు ఇటు అయిందా? పెట్టుబడి సొమ్ముతో పాటు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదరవుతుంది.

ఆ సీక్రెట్ తెలిస్తే..  అందరూ కోటీశ్వరులే.. 
ఇంతకీ లక్షల్లో పెట్టుబడి పెట్టి.. కోట్లల్లో ఆదాయాన్ని ఆర్జించడం సాధ్యమేనా? అంటే.. అందుకు ఒక సీక్రెట్ ఉంది. అందులోనే మ్యాజిక్ ఉంది.. ఈ ఆర్థిక రహస్యాన్ని తెలుసుకుంటే ఎవరైనాసరే సులభంగా ధనవంతులై పోవచ్చు. ఉదాహరణకు.. మీరు 20 ఏళ్ల వయస్సులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టారనుకుందాం.. 20శాతం చొప్పున కలిపితే, మీకు 65 ఏళ్లు వచ్చేసరికి మీ పెట్టుబడి రూ. 99 కోట్లకు పెరుగుతుంది. ఇదే అసలైన మార్కెట్ సీక్రెట్.. మీరు 30 ఏళ్ల వయస్సులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టారని అనుకుందాం.. 15% వడ్డీ చేరుతుంది. మీకు 60 ఏళ్లు వచ్చేసరికి మీ పెట్టుబడి కోట్లకు చేరుతుంది. వాస్తవానికి.. ఈ కలను నిజం చేసుకోవాలంటే మీరు ఆర్థిక నిపుణుడిగా ఉండవలసిన అవసరం లేదు.. ఇతరుల ఆర్థిక పరిస్థితుల్లో కూడా సాయం చేయవచ్చు.

మీరు చేయాల్సిందిల్లా.. సరైన పెట్టుబడి రైట్ ప్లేసులో.. ఇక్కడే ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ స్ట్రాటజీని అమలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు పదవీ విరమణ చేసే సమాయానికి సంపన్నులుగా మారిపోవచ్చు. అదేవిధంగా.. రియల్ ఎస్టేట్ అసెట్, FD పెట్టుబడులపై 5-8శాతం వరు లాభం పొందవచ్చు. మీ పెట్టుబడిని హైక్వాలిటీ స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు SIPలలో (systematic investment plan) కేటాయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు మీ కాంపౌండింగ్ లాభాన్ని స్థిరంగా 20శాతం, 25శాతం, 30శాతం లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో పెంచుకోవచ్చు. మార్కెట్లో సురక్షితమైన పెట్టుబడి పెట్టి.. మీ ఆర్థిక లక్ష్యాన్ని సగంలోనే లేదా అంతకంటే తక్కువ సమయంలో చేరుకోవచ్చు.

ఉదాహరణకు.. మీ తండ్రి 2001లో ఐషర్ మోటార్స్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టారనుకుందాం.. ఈరోజు దాని విలువ ఎంత ఉందో తెలుసా? రూ.1,45,19,274కి దూసుకెళ్లింది. మీ నాన్నగారు 1980లో విప్రో షేర్లలో రూ. 10,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఈ రోజు దాని విలువను మీరు ఊహించగలరా? కేవలం 41శాతం కంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో రూ. 801 కోట్లు సంపాదించవచ్చు. గత 10ఏళ్లల్లో 100 టాప్ కంపెనీలు స్థిరంగా 15శాతం నుంచి 50శాతం లాభాలను ఆర్జిస్తున్నాయి.

ధనవంతులుగా.. పేదలను పేదలుగా మార్చేది ఏంటి? :
ధనవంతులు ధనవంతులుగానే ఉండిపోతున్నారు.. పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో కారణాన్ని కనుగొన్నారు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.. ఇందులో ఒక లాజిక్ ఉందన్నారు. మేజిక్ ఆఫ్ కాంపౌండింగ్‌ను అర్థం చేసుకున్న వ్యక్తులు మాత్రమే సంపాదిస్తారు.. అది లేని వారు దానిని చెల్లిస్తారని వివరణ ఇచ్చారు. సంపాదించేవాళ్ల కంటే చెల్లించేవారే ఎక్కువ ఎందుకు అంటే.. అందుకు 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

పేదలు.. ఎందుకు పేదలు అవుతారంటే :
1. చెడు ఆర్థిక అలవాట్లు (Bad Financial Habits) : చాలామంది సంపాదించడానికే కష్టపడి పని చేస్తారు. అంతేకాదు.. వారి కుటంబ సభ్యుల సమయాన్ని కూడా వృథా చేసేస్తారు. అసలు వాస్తవం ఏంటంటే.. వారు కష్టపడి సంపాదించిన ఆదాయంలో ఎక్కువ భాగం ఐషర్ మోటార్స్, విప్రో స్టాక్‌లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తారు. అలాగే.. క్రెడిట్ కార్డ్‌లపై వస్తువులను కొనుగోలు చేసి 35శాతం వడ్డీ రేట్లతో తిరిగి చెల్లిస్తారు. ఇంకెక్కడా డబ్బులు కూడబెట్టేది..

2. లాటరీ విధానంపై వెర్రి ( Lottery Approach or Lack of Patience) : చాలామంది వ్యక్తులు రాత్రికి రాత్రే కోటిశ్వరులు అయిపోవాలని కలలు కనేస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు లాటరీలపై భారీగా ఖర్చు చేస్తుంటారు. అదే ఆర్థిక సమ్మేళనం అనేది.. కనిష్టంగా మొదలవుతుంది. ఇందులో తక్షణ ఫలితం ఉండదు. రాబడి వచ్చేంతవరకు ఓపిక ఉండదు. అప్పటివరకు ఆగలేక పెట్టుబడిని ఆపివేస్తారు.. పెట్టిన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడం మొదలుపెడతారు.

3. పెట్టుబడి వ్యూహంలో లోపం : ( Poor Investment Strategy): పెట్టుబడులపై వీరికి పెద్దగా అవగాహన ఉండదు. ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలో తెలియదు. అప్పుడు వీరు ఎంతగా పెట్టుబడులు పెట్టినప్పటికీ.. ఏడాదికి లాభాలలో 18శాతం లేదా 25శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు.. దీంతో పోలిస్తే.. 5శాతం లేదా గరిష్టంగా 10శాతం రాబడితో స్థిరపడతారు. దీర్ఘకాలం పెట్టుబడుల్లో 2శాతం లేదా 5శాతంతో స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంటుంది.

4. పెద్ద పెట్టుబడిపై ఆలస్యం చేయడం : పెట్టుబడి పెడుతున్నారా? అంటే.. చాలామంది కొంత పెద్ద మొత్తాన్ని ఆదా చేస్తామంటారు. ఆ తర్వాతే పెట్టుబడి పెడతామని చెబుతుంటారు. పెట్టుబడిని ఈ రోజు ప్రారంభించడానికి మీకు లక్షలు అవసరం లేదని గుర్తించుకోవాలి. నిజానికి, టాప్-అప్ SIP కింద.. మీరు నెలవారీ రూ. 5000 (లేదా అంతకంటే తక్కువ)తో ప్రారంభించవచ్చు. మీ ఆదాయం పెరిగేకొద్దీ.. మీ ఆర్థిక ప్రణాళికను బట్టి ప్రతి 6 నెలలకు రూ. 2000 లేదా రూ. 5000 వరకు చేర్చుకోవచ్చు.

5. నిపుణుల సూచనలపై నిర్లక్ష్యం : మీకు అనారోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. ఇంట్లో ఏదైనా వస్తువు రిఫేర్ అయితే మెకానిక్ దగ్గరకు వెళ్తారు. కానీ, ఆర్థికపరంగా సమస్య వస్తే.. మాత్రం ఆర్థిక నిపుణుల సలహాలను తీసుకోరు. మీ ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడి విషయానికి వస్తే.. మీ జీవనశైలి, సంపద, పదవీ విరమణ ఆదాయం, మీ సంపదను మీరు పెట్టే పెట్టుబడిని ఎంత నైపుణ్యంగా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది వ్యక్తులు నిపుణుల సహాయం తీసుకునేందుకు సంకోచిస్తుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు.. చాలామంది ఆర్థిక నిపుణులలో పారదర్శకత లోపించడమే.. మీరు ధనవంతులు అయ్యేందుకు అర్హులే.. పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి.. ధనవంతుడిలా ఆలోచించడానికి ప్రయత్నించండి.. అప్పుడు మీరే మీలో ఆ తేడాను చూడటం గమనిస్తారు. ఇది మీ సంపదను పెంచడానికి మార్గంగా మారుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే పెట్టుబడులు పెట్టండి.. ధనవంతులయ్యే మార్గానికి మీరే బాటలు వేసుకోండి..

Read Also :  Paytm CEO : నెలకు రూ.10వేల జీతమని.. నాకు పిల్లను ఇవ్వనన్నారు : విజయ్ శేఖర్ శర్మ