Paytm CEO : నెలకు రూ.10వేల జీతమని.. నాకు పిల్లను ఇవ్వనన్నారు : విజయ్ శేఖర్ శర్మ

పేటీఎం.. డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాంలో అగ్రగామి.. అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా పేటీఎం మార్కెట్ విస్తరించింది. అంతేకాదు.. భారత్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ (IPO) స్థాయికి ఎదిగింది.

Paytm CEO : నెలకు రూ.10వేల జీతమని.. నాకు పిల్లను ఇవ్వనన్నారు : విజయ్ శేఖర్ శర్మ

How Paytm Ceo Vijay Shekhar Sharma Went From Making Rs. 10,000 A Month To Becoming A Billionaire

Paytm CEO : పేటీఎం.. డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాంలో అగ్రగామి.. అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా పేటీఎం మార్కెట్ విస్తరించింది. అంతేకాదు.. భారత్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ (IPO) స్థాయికి ఎదిగింది. దీని వెనుక ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కృషి ఉంది. అదే ఆయన్ను బిలియనీర్ స్థాయికి చేరేలా చేసింది. కోటీశ్వరుడిగా మారి వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఎందరో పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలిచారు. ఆయన ఎవరో కాదు.. పేటీఎం సీఈఓ  (Vijay Shekhar Sharma) విజయ్ శేఖర్ శర్మ (43). బాంబే స్టాక్ ఎక్ఛేంజీలో లిస్టింగ్ అయిన సందర్భంగా విజయ్ శేఖర్ సంస్థ ఎలా ఎదిగిందో వివరించారు. అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ విజయ్ శేఖర్ కంటతడి పెట్టుకున్నారు.

సాధారణ జీవితం నుంచి బిలియనీర్ స్థాయికి.. :
పేటీఎం సీఈఓ విజయ్ శర్మ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 27ఏళ్ల వయస్సులోనే ఓ సంస్థను స్థాపించారు. మొబైల్ కంటెంట్ విక్రయించడం మొదలుపెట్టారు. అప్పుడు విజయ్ శర్మ నెలకు వచ్చే సంపాదన కేవలం రూ.10వేలు మాత్రమేనట. అప్పట్లో తనకు పదివేల జీతమని తెలిసి పిల్ల (అమ్మాయిని)ని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదట.. ఎటు సరిపోని ఆ జీతంతో తన కుటుంబానికి అర్హతలేని బ్యాచిలర్ గా మారినట్టు ఆయన చెప్పుకొచ్చారు. 2004-05 ఏడాదిలో తన కంపెనీని మూసేయమన్నారు.. రూ.30వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని చూసుకోవాలని తండ్రి సూచించారు.

అలాంటి కుటుంబ పరిస్థితులను అధిగమించి ఇప్పుడు రూ.18వేల కోట్ల IPOతో భారత స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి చరిత్ర సృష్టించారు విజయ్ శేఖర్ శర్మ. పేటీఎం తర్వాత తానేం చేసేది తల్లిదండ్రులకు కూడా తెలియదన్నారు. తన సంపాదన గురించి కూడా వారి అవగాహన లేదట. తన సంపాదనపై ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని వాళ్ల అమ్మ చూశారట.. విజయ్.. పత్రికలో చెబుతున్నట్టు.. అంత డబ్బు నిజంగా నీ దగ్గరుందా..? అని తల్లి అడిగారని విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.  యూపీకి చెందిన విజయ్ శేఖర్ శర్మ తండ్రి ఉపాధ్యాయుడు.. తల్లి సాధారణ గృహిణి. 2005లో విజయ్‌కు పెళ్లి అయింది. ఒక కుమారుడు ఉన్నాడు.

One97.. 2010లో Paytmగా అవతరణ.. 
బిలియనీర్ స్థాయికి ఎదిగినప్పటికీ కూడా తనకు రోడ్డుపక్కన ఉండే బండిమీద దొరికే పదార్థాలంటే చాలా ఇష్టపడుతారు. పాలు, బ్రెడ్ కోసం ఉదయం పూట స్వయంగా తానే వెళ్లి బయట నుంచి తీసుకొస్తారట.. One97 కమ్యూనికేషన్ (PaytM పేరంట్ కంపెనీ) పేరుతో 2000 సంవత్సరంలో విజయ్ శేఖర్ శర్మ ఒక కంపెనీని స్థాపించారు. మొదట్లో ఇది టెలికాం ఆపరేటర్లకు కంటెంట్ అందించే సంస్థ . రానురాను One97.. 2010లో Paytmగా మారింది. ఆ వెంటనే ఆన్ లైన్ పేమెంట్లలోక కూడా ఎంట్రీ ఇచ్చింది. 2014లో Wallet payments లైసెన్స్ కూడా పొందింది.

2015లో చైనాకు యాంటీ గ్రూప్ Paytmలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టింది. ఇదే టర్నింగ్ పాయింట్.. భారీ స్థాయిలో సర్వీసులను పేటీఏం ప్రారంభించింది. అలా తక్కువ సమయంలోనే దేశం నలుమూలలా తన మార్కెట్ విస్తరించింది. 2016లో కేంద్రం పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడం పేటీఎంకు బాగా కలిసొచ్చింది. డిజిటల్ పేమెంట్స్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. 2017 ఏడాదిలో యువ బిలియనీర్స్ జాబితాలో విజయ్ శేఖర్ చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. ప్రస్తుతం విజయ్ శేఖర్ శర్మ సంపాదన విలువ రూ.18వేల కోట్లు (2.4 బిలియన్ డాలర్లు).

Read Also : Paddy Procurement : కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్, దేశం కోసం పోరాడుతాం