Paddy Procurement : కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్, దేశం కోసం పోరాడుతాం

ఢిల్లీలో రైతులు ఉద్యమాన్ని అణదొక్కుతున్నారని తెలిపారు. లఖింపూర్ లో రైతులపైకి వాహనాలు ఎక్కి హత్య చేస్తున్నారని విమర్శించారు.

Paddy Procurement : కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్, దేశం కోసం పోరాడుతాం

Indirapark (1)

KCR, TRS Leaders Protest : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు, నిర్ణయాలను ఆయన తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ప్రభుత్వ విధానాలు సరైనవిగా లేవని, రాష్ట్రానికి సాయం చేయడం లేదని దుయ్యబట్టారు. రైతుల విషయంలో కేంద్రం అడ్డగోలు నిర్ణయాలు తీసుకొంటోందని, రైతులు వ్యవసాయం చేసుకోవాలా ? వద్దా ? అని ప్రశ్నించారు. రైతులను బతకనిస్తారా ? బతకనియ్యరా అని నిలదీశారు.

Read More : CM Kcr Warning : వడ్లను తీసుకోవాల్సిందే..లేకపోతే బీజేపీ ఆఫీసుపై కుమ్మరిస్తాం – సీఎం కేసీఆర్ హెచ్చరిక

2021, నవంబర్ 18వ తేదీ…గురువారం వరి కొనుగోళ్లపై కేంద్రంతో సమరానికి సై అంటూ టీఆర్‌ఎస్‌ చేపట్టిన మహా ధర్నా ఇందిరాపార్క్ లో కొనసాగుతోంది. ఈ ధర్నాకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. అనంతరం సభను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారాయన. వ్యవసాయ చట్టాలు బాగా లేవని చెబుతూనే ఉన్నామని, ఢిల్లీలో రైతులు ఉద్యమాన్ని అణదొక్కుతున్నారని తెలిపారు. లఖింపూర్ లో రైతులపైకి వాహనాలు ఎక్కి హత్య చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం సర్జికల్ స్ట్రైక్ లను నమ్మేస్థితిలో ఎవరూ లేరని, సరిహద్దులో ఆడే నాటకాలు మానుకోవాలని హితవు పలికారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే దారుణమైన పరిస్థితిల్లో దేశం ఉందని ఆవేదన వ్యక్త చేశారు.

Read More : CM KCR : తెలంగాణ పండించే వడ్లను కొంటరా ? కొనరా ? సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న

కేంద్రం రాజకీయ డ్రామకు పరిమితమైందని, ఎలక్షన్ వస్తే..హిందూ..ముస్లిం కొట్లాట పెడుతారని ఎద్దేవా చేశారు. ఇదేనా మీరు చేస్తున్న రాజకీయం అంటూ ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నిస్తున్నా..తాను మాట్లాడే మాట గంటలో ఆయన టేబుల్ మీదకు వస్తుందన్నారు. ఈ సభలో కూడా బీజేపీ సీఐడీలు ఉన్నారని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు గురించి అడిగిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పారని, ఎప్పుడు ఫోన్ చేసినా..పర్యటనల్లో ఉన్నామని చెప్పారని వివరించారు. నా మీద ఏం కేసులు పెడుతారో పెట్టుకోవాలని సవాల్ విసిరారు.