Uper Ultra Pro Max Level Woman Wearing A Jewelry Mask
Jewelry Mask: కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మూతి, ముక్కు కవర్ చేసేలా మాస్క్ ఒక్కటే తొలి ఆయుధం. దీంతో యావత్ దేశమంతా ఇప్పుడు మాస్క్ వాడకం విధిగా మారిపోయింది. అయితే, ఇది వివాహాలు, శుభకార్యాలకు ముహూర్తాల సమయం. శుభకార్యాలంటే మన మహిళల వస్త్రధారణ, ఆభరణాల గురించి మనకి తెలిసిందే. వస్త్రధారణ ఎలా ఉన్నా నగల అలంకరణలో మాత్రం మాస్క్ ఒక అడ్డంకిగా మారింది. ముఖ్యంగా ముక్కెర ధరించాలంటే మాస్క్ ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకవేళ ముక్కెర ధరించి మాస్క్ ఉపయోగిస్తే ముక్కెర కనిపించదు.
కానీ ఓ మహిళ ఈ సమస్యను అధిగమించేలా మాస్క్ మీదనే ముక్కెర ధరించి ఇదే ఇప్పుడు నయా ట్రెండ్ అని నిరూపించింది. ముందుగా N-95 మాస్క్ ధరించిన ఆ మహిళ మాస్క్ మీదనే ముక్కెర ధరించింది. ఆమె మాస్క్‌తో పాటు ఆభరణాలు ధరించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫోటోను IPS అధికారి దీపాన్షు కబ్రా ట్విట్టర్ లో షేర్ చేశారు. దానికి ‘జ్యువెలరీ జుగాడ్’ అని క్యాప్షన్ పెట్టారు. ఇక ఆ మహిళను “సూపర్ అల్ట్రా ప్రో మాక్స్ లెవెల్ ఉమెన్” అని తన పోస్టులో మెచ్చుకున్నారు.
#JewelleryJugaad level "Super Ultra Pro Max…" ??? pic.twitter.com/2JV0NpX2v3
— Dipanshu Kabra (@ipskabra) May 7, 2021
ఈ మహిళకు వచ్చిన రక్షణతో కూడిన అలంకరణ ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ట్విట్టర్‌లో ఈ పోస్టు వైరల్ అవుతుండగా ఇప్పటివరకు రెండు వేలకు పైగా లైక్స్ వచ్చాయి. భారతీయులు దేన్నయినా తమకు అనుగుణంగా మలుచుకుంటారని ఈ ఫోటో ద్వారా మరోసారి తెలియజెప్పిందని ఆ మహిళను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే మ్యాచింగ్ మాస్కులు, డిజైన్ల మాస్కులు వచ్చేసిన మన సమాజంలో మరి ఇక నుండి మన మహిళలు ఈ తరహా మాస్క్ మీద ముక్కెరను ధరించడం ఫ్యాషన్ గా మార్చుకుంటారేమో చూడాలి.