రద్దీ ప్రాంతాల్లో సేఫ్‌గా ఉండాలంటే గూగుల్ మ్యాప్స్ ఇలా వాడాల్సిందే!

  • Publish Date - June 11, 2020 / 04:44 PM IST

దేశంలో కొవిడ్-19 లాక్ డౌన్ సడలింపుతో పలు రాష్ట్రాల్లో నెమ్మదిగా అన్ని తెరుచుకుంటున్నాయి. అంటే.. అర్థం గతంలో మాదిరిగా సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు అని కాదు.. మందు లేని కరోనా వైరస్ తో కలిసి జీవించాల్సిన పరిస్థితి. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతక వైరస్ అన్ని చోట్ల వ్యాపించి ఉంది. కరోనాతో మానవుల మనుగడకు ముప్పు వైరస్ రూపంలో పొంచే ఉంది. కరోనాను కట్టడి చేయాలంటే ప్రస్తుతం ఉన్న ఒకటే ఆయుధం సామాజిక దూరం.. ఇదొక్కటే కరోనాను నివారించగల అస్త్రం. కానీ, లాక్ డౌన్ సడలింపులతో జనజీవనం తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. 

అవసరమైన ప్రతిచోటకు వెళ్లాల్సిందే.. రద్దీగా ఉన్న ప్రాంతాలకు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు. రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లిన సమయంలో కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో గూగుల్ మ్యాప్స్ (Google Maps) బాగా ఉపయోగపడుతుంది. గత ఏడాదిలోనే గూగుల్ అద్భుతమైన ఫీచర్ ఒకటి ప్రవేశపెట్టింది. అదే.. Dubbed Crowdedness Predictions. ఈ గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ద్వారా జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ప్రత్యేకించి ఏదైనా ప్రదేశం లేదా పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో వెళ్లే సమయంలో రద్దీగా ఉన్నప్పుడు ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. భారతదేశంలోనూ ఈ ఫీచర్ ఇప్పుడు అందుబాటులోనే ఉంది. 

Google Maps crowd prediction :

గూగుల్ మ్యాప్స్ పై కనిపించే డైరెక్షన్స్ యూజర్లంతా చెకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపించే Transit Details ఆప్షన్ కింద Tap చేయాలి. కిందికి స్ర్కోలింగ్ చేసిన తర్వాత మీకో మరో ఆప్షన్ ‘crowdedness predictions’ కనిపిస్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, iOS ప్లాట్ ఫాంలపై వచ్చిన కొత్త అప్ డేట్ ఫీచర్లలో ఇదొకటి. రియల్ టైంలో రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి మ్యాప్స్ ద్వారా సమాచారాన్ని యూజర్లకు చేరవేస్తుంది. అలాంటి సమయాల్లో మీరు వెళ్లడాన్ని సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడమే ఉత్తమం. జనం కదలికలను అర్థం చేసుకునేలా గూగుల్ crowdedness predictions’ మోడల్ డెవలప్ చేసింది. కచ్చితమైన అంచనాలతో క్రౌడ్ వివరాలను యూజర్లు తెలుసుకునేందుకు ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. 

Google Maps data privacy :

మీ డేటా ప్రైవసీ విషయంలో ఆందోళన చెందుతున్నారా? ఇలాంటి ఫీచర్ల విషయంలో గూగుల్ కొన్ని డేటాలను బహిర్గతం చేయకుండా ఉండేలా యూజర్లకు వెసులుబాటు కల్పించింది. అకౌట్ లెవల్ సెట్టింగ్ లోని Google Location History ఆప్షన్ by Default ఆఫ్ లోనే ఉంటుంది. మీ డేటా ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకునేందుకు వీలుగా గూగుల్ తమ ఇన్ సైట్స్‌లో తగినంత ప్రైవసీ డేటాను ఉండేలా సెట్ చేసింది. సో.. డోంట్ వర్రీ.. గూగుల్ మ్యాప్స్ ద్వారా రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోండి..