Vijay Devarakonda : ఈడీ విచారణ తరువాత విజయ్‌ దేవరకొండ వ్యాఖ్యలు.. ఏమన్నా చెబితే వాళ్ళు ఫీల్ అవుతారు..

ఇటీవల ‘లైగర్’ సినిమా నిర్మాణంలో కొందరు రాజకీయ నాయకులు అక్రమంగా డబ్బు పెట్టారు అంటూ, ఆ లావాదేవీలు కూడా విదేశాలు నుంచి జరిగాయంటూ ఈడీ అధికారులు చిత్ర యూనిట్ ని వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపించింది. తాజాగా నేడు ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండని కూడా ఈడీ ప్రశ్నించింది.

Vijay Devarakonda : టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ మూవీని వీడని కష్టాలు. ఎన్నో అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న రీతిలో ఆకట్టుకోలేకపోవడంతో నిర్మాతలు, బయ్యర్ లు భారీగా నష్టపోయారు.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు

ఇక ఇటీవలే డిస్ట్రిబ్యూటర్ లు నష్టపరిహారం ఇవ్వాలంటూ వార్తలో నిలిచింది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా నిర్మాణంలో కొందరు రాజకీయ నాయకులు అక్రమంగా డబ్బు పెట్టారు అంటూ, ఆ లావాదేవీలు కూడా విదేశాలు నుంచి జరిగాయంటూ ఈడీ అధికారులు చిత్ర యూనిట్ ని వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపించింది. ఇటీవలే చిత్రనిర్మాతలు పూరీజగన్నాధ్, ఛార్మి లను కూడా ప్రశ్నించాడు.

తాజాగా నేడు ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండని కూడా ఈడీ ప్రశ్నించింది. దాదాపు 12 గంటలపాటు జరిగిన విచారణ అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడాడు. “పాపులారిటీ వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లో ఇది ఒకటి. ఈడీ అధికారులు పిలిచారు నేను వచ్చాను. వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చా. అంతకుమించి ఏమిలేదు, ఇంకా ఏమన్నా చెబితే వాళ్ళు ఫీల్ అవుతారు” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ట్రెండింగ్ వార్తలు