Chandrababu On Palnadu Murders
chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసులు ప్రదర్శిస్తోన్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… జగన్ దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసుల దిగజారి పోతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. చిత్తూరులో మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి, అక్రమ కేసులు పెట్టడంలో అర్థం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.
Presidential Election: ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారు?: విజయసాయిరెడ్డి
నేరస్తులను కాపాడుతున్నారా అని ఆయన నిలదీశారు. పోలీసులే చిత్తూరు మాజీ మేయర్ హేమలత అనుచరుడు పూర్ణ ఇంట్లో గంజాయి బస్తా పెట్టి కేసులు రాయడం దుర్మార్గంమని ఆయన అన్నారు. పోలీసులు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకోడానికి వచ్చిన హేమలత మీదికి, మహిళ అని కూడా చూడకుండా పోలీసు జీపు ఎక్కించడానికి ఎంత ధైర్యమని నిలదీశారు. ఎవరి అండ చూసుకుని ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారని ప్రశ్నించారు.
Maharashtra: శరద్ పవార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరిస్తున్నారు: సంజయ్ రౌత్
ప్రభుత్వం చేయించిన ఈ దౌర్జన్యకాండను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన చెప్పారు. వైసీపీ కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. వైసీపీ తరఫున న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. రేపు మేము అధికారంలోకి వచ్చాక గాడి తప్పిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.