రజనీకాంత్, అమీర్‌ఖాన్ లాంటి సెలబ్రిటీలు ఇన్నోవాను ఎందుకు వాడతారంటే? 5 కారణాలు

  • Publish Date - October 12, 2020 / 06:39 PM IST

Toyota Innova  చాలాకాలంగా మార్కెట్ లో నమ్మదగిన వేహికల్ గా పేరుంది. ఎక్కువగా ట్రావల్ కంపీలు వాడేవి.  2016, Toyota, Innova Crysta లాంచ్ చేసిన తర్వాత సీన్ మారిపోయింది. 25 లక్షలు పెట్టగల డబ్బున్నవాళ్లూ ఇన్నోవాను కొనడటం మొదలుపెట్టారు. హీరో నాగార్జున లాంగ్ టూర్స్ కి ఇన్నోవానే వాడతారు. చాలామంది సెలబ్రిటీలకు బెంజ్, ఆడీ ఉన్నా, జర్నీలకి మాత్రం ఇన్నోవానే. ఎందుకిలా? ఇన్నోవా అంటే సెలబ్రిటీలకు ఎందుకంత మోజు? 5 కారణాలివే.

1. బుల్లెట్‌ఫ్రూఫ్ లాంటి వేహికల్
లక్ష కిలోమీటర్లు దాటినా కొత్తగానే అనిపిస్తుంది. రెండుమూడు లక్షల కిలోమీటర్లు దాటినా నో ప్రొబ్లమ్. ఇండియాలో 10 లక్షలు తిరిగిన ఇన్నోవా ఉంది. ఇంజన్ పరంగా ఎలాంటి ఇబ్బందలూ రావు. బండి ఎప్పుడూ ఆగదు. స్టీరింగ్ పట్టుకున్నామంటే ధైర్యంగా అనిపిస్తుంది. ఇంకో సంగతి D4D engine అంటే ప్రపంచవ్యాప్తంగా పాపులర్. నమ్మదగిన ఇంజిన్. లక్షలు కిలోమీటర్లు తిరిగినా, ఆగనే ఆగదు.

బాలీవుడ్ స్టార్ మలైకా అరోరా ఇన్నోవాను నడుపుతూ కనిపిస్తారు. ఆమెది పెట్రోల్ ఆటోమేటిక్ ఇన్నోవా.

2. కంఫర్టబుల్
ladder-frame chassisతో కంఫర్టబుల్ సస్పెన్షన్ సెటప్‌తో ఇన్నోవా తయారైంది. అందుకే ఇన్నోవాలో జర్నీచేస్తుంటే టైం తెలియదు. బాడీ పెయిన్స్ ఉండవు. ఎగుడుదిగుడు రోడ్లమీదా సాఫీగా బండివెళ్లిపోతుంది. అందుకే లాంగ్ టూర్లకెళ్లే సెలబ్రిటీలు ఇన్నోవా నమ్ముకొంటారు.

మాధురీ దీక్షిత్ తన స్టైల్‌కి తగ్గట్టుగా ఇన్నోవాను మోడిఫైడ్ చేసుకున్నారు.

3.ఆఫ్టర్ సేల్స్ సర్వీస్
ఇండియాలో టయోటాకు మంచి సర్వీస్ నెట్ వర్క్ ఉంది. మెయింటినెన్స్ ప్యాకేజీలు బాగుంటాయి. అందుకే ఓవనర్ షిప్ అంత ఖర్చు అనిపించదు. సర్వీస్ ఛార్జీలుకూడా తక్కువ. అందుకే ఇన్నోవాకు రీసేల్ వాల్యూ ఎక్కువ. మూడునాలుగేళ్లు వాడిన తర్వాత ఇన్నోవాను సేల్ చేసినా, బాధ అనిపించదు. మంచి రేటే వస్తుంది.

Jackie Shroffకు బెంట్లీ, బెంజ్ రెండూ ఉన్నాయి. అయినా ఇన్నోవానే ఎక్కువగా వాడతారు. ఆయనే డ్రైవ్ చేస్తారు.


4. ఇన్నోవాలోకి వెళ్లడం, దిగడం సులువు

హై సీటింగ్ పొజీషన్. బార్లా తెరుచుకొనే డోర్. ఇన్నోవాలోకి వెళ్లడం చాలా ఈజీ. సీనియర్ సిటిజన్స్ కు ఇన్నోవా నచ్చేది అందుకే. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. నిజానికి కారు ఎక్కువమందికి రీచ్ కావాలంటే ఇది చాలా ముఖ్యం.

అంతెందుకు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఇన్నోవా అంటే చాా ఇష్టం. ఆయనే డ్రైవ్ చేస్తారు. ఆయన గ్యారేజీలో high end luxury vehiclesతోపాటు ఇన్నోవాకూడా ఠీవిగా కనిసిస్తుంది.

5. ప్రీమియం ఫీిలింగ్
Innova Crysta ఫీచర్స్ అదిరిపోతాయి. LED projector headlamps, ambient lighting, rear AC digital display, leather seats, dashboardలతో ఏ రిచ్ కారుకి తీసిపోదు. అందుకే చాలామంది Crystaను ప్రిఫర్ చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు