Chronic Stress : ఉద్యోగాలు చేసే మహిళల్లో…. దీర్ఘకాలిక ఒత్తిడి

రోజుల కొద్దీ ఉద్యోగ జీవితంలో బోర్ కొడితే సెలవు పెట్టుకుని ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి మనస్సు ప్రశాంత చేకూరేలా ఎంజాయ్ చేయాలి.

Chronic Stress : ఉద్యోగాలు చేసే మగవారితో పోలిస్తే ఆడవారిలో దీర్ఘకాలిక ఒత్తిడి అధికంగా ఉన్నట్లు ఇప్పటికే అనే అధ్యయనాల్లో తేలింది. మగవాళ్లతో పాటే కెరీర్ ప్రారంభించిన మహిళలు ఒక స్ధాయి తరువాత వెనుకబడిపోవటం గమనించే ఉంటాం. చాలా మందిలో ఇదే జరుగుతుంది. దీనికి విభిన్న కారణాలు లేకపోలేదు. వృత్తి పరమైన బాధ్యతలు, కుటుంబ పరమైన బాధ్యతలు అధికం కావటమే ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగానే చాలా సంస్ధలు, కంపెనీలు మహిళలకు ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తుంటాయి. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే మహిళలు ఎంత ఒత్తిడితో ఉన్నా ఓర్పు, నేర్పుతో కార్యకలాపాలు చక్కదిద్దుతారన్న అభిప్రాయం అందరిలో ఉంటుంది. ఇలాంటి పరిస్ధితుల్లో దీర్ఘకాలిక ఒత్తిళ్ల నుండి బయటపడుతూ కెరీర్ లో ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ రకాల పద్దతులను అనుసరిస్తూ ఒత్తిడిని జయించాలి. మనసుకు నచ్చిన పనిని చేస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

మనస్సుకు నచ్చింది చేయటానికి సమయం ఎక్కడుంటుందని చాలా మంది అనుకోవచ్చు. అయితే ఉద్యోగ సమయం తరువాత ఇంటికి చేరాక కనీసం అరగంటపాటైన చదవటం, రాయటం, సినిమాలు చూడటం, నచ్చిన సంగీతం వినటం, తోటపని ఇలాంటి వాటితో గడపటం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

ఉద్యోగం చేసే ప్రదేశంలో వ్యతిరేక భావనలు లేకుండా చూసుకోవాలి. పనిపట్ల సానుకూల భావన కలిగి ఉండాలి. కార్యాలయంలో సహా ఉద్యోగులతో సరదాగా ఉండటం, బాస్ చెప్పిన పనులు మర్చి పోకుండా పూర్తిచేయటం వంటివి తూచాతప్పకుండా పాటించాలి. ఇలా చేయటం వల్ల ఒత్తిడికి ఆస్కారమే ఉండదు.

రోజుల కొద్దీ ఉద్యోగ జీవితంలో బోర్ కొడితే సెలవు పెట్టుకుని ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి మనస్సు ప్రశాంత చేకూరేలా ఎంజాయ్ చేయాలి. ఇలా చేయటం వల్ల తిరిగి విధుల్లో చేరాక రెట్టించి ఉత్సాహంతో పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఒత్తిడిని నుండి బయటపడేందుకు రన్నింగ్ , వాకింగ్, యోగా వంటి వాటిని అనుసరించటం మంచిది. వీటి వల్ల మంచి ఫలితం ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఒత్తిడి నుండి బయటపడేందుకు అవకాశం ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు