Poppy Seeds
Poppy Seeds : భారతీయుల వంటల్లో ఉపయోగించే దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. ఇవి ఆవాలు కంటే చిన్నగా తిన్నపుడు కాస్త తీపి, కాస్త వగరు కలిసిన రుచితో ఉంటాయి. వీటికి చలువ చేసే గుణం ఎక్కువ. పాయసాలు, ఇతర తీపి వంటకాలలోనే కాకుండా, మసాలా కూరల్లో కూడా గసాగసాలను రుచి కోసం ఉపయోగిస్తారు. గసగసాలు అనేవి నల్లమందు మొక్క నుండి లభ్యమయ్యే విత్తనాలు. అందుకే ఇవి కాస్త మత్తు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. గసాగసాలను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్వీట్లు, సంప్రదాయ వంటల్లోనే కాకుండా, ఖరీదైన వంటల్లో వీటి వాడకం ఎక్కువ.గసాగసాలను మిక్సీ వేసి పేస్ట్ లా చేసి దాన్ని పిండి పాలు తీసి ఉపయోగించవచ్చు. ఇవి చూడటానికి గోధుమ పాలలా ఉంటాయి. తీపి రుచిని కలిగి ఉంటాయి. గసాలను పాయసంలా వండుకుని తీసుకోవచ్చు.
గసాలు పాలు పోసి కూర వండుకుని తినచ్చు. పచ్చివి నోట్లో వేసుకుని నమలచ్చు. దోరగా వేయించి డ్రై ఫ్రూట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ బార్ లాంటి వాటితో జతచేయవచ్చు. కూరలకు వేసే మసాలా పేస్ట్ లో వేసి గ్రైండ్ చేసి కూర వండితే ఆ కూర రుచి కమ్మగా ఉంటుంది. కొందరిలో దెబ్బ తగలగానే రక్తం ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటపుడు వాళ్ళు చాలా రక్తం కోల్పోతారు. గసగసాలు తీసుకుంటే ఇలా గాయాలు తగిలినపుడు రక్తం గడ్డకట్టే ప్రక్రియను అక్టీవ్ చేస్తుంది.
గసాలలో ఉండే ప్రోటీన్ శరీరంలో కణాలు, మరియు కనజాలాలను నిర్మించడానికి మరియు దెబ్బ తిన్న కణజాలాన్ని మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ద్రవాలు సమతాస్థితిలో ఉండేందుకు గసాలు తోడ్పడతాయి. దీనివల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. కణాలు కణజాలాల ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర వహించడం వల్ల ఇవి రోగనిరోధక శక్తికి శరీరం బాగా స్పందించేలా చేస్తాయి. దీనివల్ల జబ్బులకు శరీరం దెబ్బ తినకుండా ఉంటుంది.
గసగసాలలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్. కాబట్టి వీటిని తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. గసగసాలలో బోలెడు ప్రోటీన్లు, మరియు విటమిన్ సి ఉండటం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తి ఎంజైమ్ లను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఈ ఫైబర్ సహాయపడుతుంది.
ఇది రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. గసగసాలలో కాల్షియం అధికంగా ఉంటుంది, ఇది శరీరంలో ఎముకలు మరియు దంతాలను బలంగా మార్చడానికి సహాయపడుతుంది. మెదడు నుండి శరీరంలోని ఇతర భాగాలకు నరాల ద్వారా సందేశాలను తీసుకెళ్లడంలో సహాయపడుతుంది.
వీటిలో మెగ్నీషియం ఉండటం వల్ల కండరాల పనితీరును అలాగే నరాల పనితీరును నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది, రక్తపోటు సక్రమంగా ఉండేలా చేస్తుంది. గసగసాలలో జింక్ సమృద్ధిగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే బాక్టీరియా మరియు వైరస్ల నుండి శరీరాన్ని రక్షించడానికి జింక్ సహాయపడుతుంది. ఇది గాయాలను నయం చేయడానికి మరియు రుచి, వాసన యొక్క సామర్త్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది.
ఒక స్పూన్ గసగసాలను పచ్చిగానే నోట్లో వేసుకుని మెల్లగా నమిలి తినడం వల్ల నోటి పూతలు తగ్గిపోతాయి. అధిక వేడి శరీరం ఉన్నవారికి తొందరగా ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అలాంటి వారు వీటిని తీసుకుంటే చలువ చేస్తుంది. గసాలు, పంచదార సమానంగా తీసుకుని మెత్తని పొడి చేసి తీసుకుంటూ ఉంటే గుండె సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
గసాల వల్ల ఉపయోగాలు, ఆరోగ్యప్రయోజనాలు మాత్రమే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. ఇవి నల్లమందు చెట్టు నుండి లభించే గింజలు కాబట్టి వీటిని అధిక మోతాదులో తీసుకుంటే మత్తుగా ఉండి, క్రమంగా వ్యసనంగా మారే అవకాశం ఉంటుంది. రోజు మొత్తం చురుగ్గా లేకుండా బద్దకాన్ని పెంచగలవు కూడా.మలబద్దకం సమస్యతో ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకుంటే ఫైబర్ కంటెంట్ అధికమైపోయి జీర్ణమవడానికి ఇబ్బంది అయ్యి సమస్యను మరింత పెంచే అవకాశం ఎక్కువ ఉంటుంది. తద్వారా కొందరిలో మొలలు సమస్య కూడా ఎదురుకావచ్చు. గసగసాల మొక్క ఇతర భాగాల నుండి డ్రగ్స్ గా పరిగణించే మార్పిన్, కొడిన్, ఒరిపావిన్ వంటివి తయారు అవుతాయి. కాబట్టి గసాలలో కూడా ఆ మత్తు ప్రభావం ఉంటుంది. వీటిని అపుడపుడు తీపి వంటకాలలో మరియు, ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుకుంటే ఎలాంటి దుష్ప్రభావం ఉండదు కానీ అతిగా వాడితే మాత్రం మత్తుకు బానిస అయినట్టే.