Headaches : తలనొప్పిని పోగొట్టే సులభమైన మార్గాలు ఇవే?

తలనొప్పులు టెన్షన్, ఒత్తిడి కారణంగా వస్తాయి. ఇది నరాలపై మరింత ప్రభావం చూపుతుంది. సాధారణ శ్వాస వ్యాయామాలతో ప్రశాంతంగా ఉంటుంది. శ్వాస వ్యాయామాలు నరాలను, కండరాలను ఉపశమనాన్ని కలిగిస్తాయి.

Are these the easiest ways to get rid of headaches?

Headaches : బిజీ లైఫ్ లో మానసిక ఒత్తిడి పెరిగడం అనేది సాధారణమైపోయింది. కొన్నిసార్లు ఈ పరిస్ధితి కారణంగా తలనొప్పి సమస్య ఉత్పన్న అవుతుంది. దీనితో తీవ్రమైన బాధ కలుగుతుంది. ఈ తలనొప్పులకు మన దినచర్యకూడా కొన్ని సందర్భాల్లో కారణం అవుతుంది. అంతే కాకుండా తల, మెడ భాగాల్లోని తొమ్మిది సున్నితమైన ప్రాంతాలు, లేదా తలలోని రక్త నాళాలు ఒత్తిడికి లోనుకావడం లేదా వాపు వల్ల తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి ఎన్నో రకాల సమస్యలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా ఇది సున్నితమైన రక్తనాళలు, మెదడుకు సంబంధించిన సమస్యగా తలనొప్పిని చెప్పవచ్చు.

తరచుగా తలనొప్పి వస్తున్నట్లయితే అస్సలు నిర్లక్ష్యం చేయరాదు. వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. తలనొప్పి సాధారణమైతే దానిని నయం చేసేందుకు కొన్ని చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది. వీటి ద్వారా తలనొప్పి నుండి బయటపడవచ్చు.

తలనొప్పిని పొగొట్టే సులభమైన మార్గాలు ;

1. తలనొప్పులు టెన్షన్, ఒత్తిడి కారణంగా వస్తాయి. ఇది నరాలపై మరింత ప్రభావం చూపుతుంది. సాధారణ శ్వాస వ్యాయామాలతో ప్రశాంతంగా ఉంటుంది. శ్వాస వ్యాయామాలు నరాలను, కండరాలను ఉపశమనాన్ని కలిగిస్తాయి.

2. తలనొప్పికి మసాజ్‌ మంచి చికిత్సావిధానం. ఒత్తిడికి గురైన కండరాలకు రిలీఫ్ ని ఇవ్వడంలో సహాయపడుతుంది. నిద్రలేకపోవడం లేదా తీవ్రమైన వ్యాయామం చేయడం వలన కండరాలపై ఒత్తిడి కలుగుతుంది. అలాంటప్పుడు మసాజ్‌లు దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

3. లావెండర్ ఆయిల్‌ తలనొప్పి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది రిలాక్స్‌గా ఉంచుతుంది. క్యారియర్ ఆయిల్‌తో కరిగించి, నొప్పి ఉన్న ప్రదేశాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి.

4. తలనొప్పికి నుదిటి పైన ఐస్ ప్యాక్ ఉంచితే తక్షణం నొప్పిని తగ్గించగలదు. రక్త ప్రవాహంలో తగ్గుదల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఐస్ ప్యాక్ అందుబాటులో లేకపోతే చల్లటి నీటిలో నుదురు బాగాన్ని కడుక్కోవటం వల్ల ఉపశమనం పొందవచ్చు.

5. ఒక కప్పు వేడి టీ తాగటం వల్ల ఒత్తిడికి గురైన కండరాలకు వెచ్చదనాన్ని, రిలీఫ్ ని ఇస్తుంది.

6. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది. గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతుంది.

7. తలనొప్పిని తగ్గించడంలో యూకలిప్టస్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. చందనం పౌడర్ ను తీసుకుని మిశ్రమంలా మార్చుకుని తలకు రాసుకొంటే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.