Yogurt In Winter : చలికాలంలో పెరుగు తినటం మానేస్తున్నారా? అయితే ఈ ప్రయోజనాలన్నీ కోల్పోయినట్లే!

పెరుగులో ఉన్న పోషకాలు మలబద్దకం వంటి జీర్ణ సంబంద సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు పెళుసుబారకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది. కండరాలు బలపడటానికి దోహదపడుతుంది. దంత, చిగుళ్ల సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు.

Are you giving up yogurt in winter? But all these benefits are lost!

Yogurt In Winter : చలికాలంలో చాలామంది పెరుగును తినడానికి ఇష్టపడరు. చలికాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని భయపడతారు. దాంతో కూరలతో తినేసి భోజనం కానిచ్చేస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో పెరుగు తినటం వల్ల ముఖ్యంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల మీద పోరాటం చేసే శక్తి శరీరానికి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చలి కాలంలో వచ్చే వైరస్ లను ఎదుర్కోవటంలో పెరుగు ఔషధంగా పనిచేస్తుంది.

పెరుగులో ఉన్న పోషకాలు మలబద్దకం వంటి జీర్ణ సంబంద సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు పెళుసుబారకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది. కండరాలు బలపడటానికి దోహదపడుతుంది. దంత, చిగుళ్ల సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. చలికాలంలో గుండె పోటు సమస్యలు అధికంగా ఉంటాయి. పెరుగును తీసుకోవటం వల్ల గుండె ఆయుష్షు పెరిగి హార్ట్ అటాక్ వంటి సమస్యలు దరిచేరవు. రక్తపోటును సైతం నియంత్రణలో ఉండేలా చూడటంలో పెరుగు సహాయపడుతుంది.

పెరుగు రోజూ తినడం వల్ల మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగును రాత్రి సమయంలో కాకుండా పగటిపూట మాత్రమే తీసుకోవాలి. చలికాలంలో రాత్రి పెరుగు తింటే మ్యూకస్ పెరుకునే ప్రమాదం ఉంది,రాత్రిళ్ళు పెరుగుకు దూరంగా ఉండడమే మంచిది. అంతేకాకుండా ఆస్తమా రోగులకు పెరుగు తినటం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.