/** * Allow only 2025 Yoast post-sitemaps and block old ones. */ add_action( 'template_redirect', function () { // only target Yoast sitemaps $request_uri = $_SERVER['REQUEST_URI']; // allow main index and news sitemap $allow_files = [ '/sitemap_index.xml', '/post-sitemap.xml', '/news-sitemap.xml', ]; // if request is one of allowed, do nothing if ( in_array( $request_uri, $allow_files, true ) ) { return; } // Match /post-sitemapXXX.xml if ( preg_match( '/post-sitemap(\d+)\.xml$/', $request_uri, $matches ) ) { $id = intval( $matches[1] ); // ✅ Allowed range of 2025 sitemaps (adjust if needed) if ( $id >= 184 && $id <= 205 ) { return; // allowed — do nothing } // ❌ Block old sitemap status_header( 404 ); exit( 'Sitemap not available' ); } });
Babies Vomit
Babies Vomit : పుట్టినబిడ్డ నుండి ఎదిగే పిల్లల్లో చాలా మంది వాంతుల సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్, గిట్టని ఆహార పదార్థం తినడం వంటి అంశాలు పిల్లల్లో వాంతులకు కారణం అవుతాయి. ఏడాదిలోపు పిల్లల్లో తాగిన పాలు పైకి వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు పట్టించే పాలు పడకపోవడం కారణం కావచ్చు. పాలల్లో ఉండే ప్రొటీన్ సైతం ఒక్కోసారి వాంతులకు దారి తీస్తుంది. శిశువుల్లో ఎక్కువసార్లు వాంతులు అవ్వటానికి తాగిన పాలు పైకి ఎగదన్నటం ,తేన్పు రాకపోవటం వల్ల కావచ్చు.
సంవత్సరంలోపు పిల్లల్లో వాంతులకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు. ఆవుపాలలో ఉండే ప్రోటీన్ కూడా ఒక్కోసారి వాంతులకు ఓ కారణం కావచ్చు. డబ్బాపాలలో కూడా ఆవుపాల ప్రోటీన్ ఉంటుంది. జ్వరంతో, జ్వరం లేకుండా, సాధారణ ఇన్ఫెక్షన్స్ వల్ల పిల్లలు వాంతులు చేసుకోవడం జరుగుతుంది. 6 మాసాలలోపు పిల్లల్లో వర్షకాలంలో చాలామందికి డయేరియా వాంతులు అవుతుంటాయి. ఏడాదిలోపు పిల్లల్లో యూరినరీ, మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వాంతులు అవుతాయి. ఒక్కోసారి చిన్నపిల్లల్లో ఆకుపచ్చటి రంగులో పసరు మాదిరిగా వాంతులు అవుతుండటం ఒక ఆరోగ్య సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. పేగు మడత పడటం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు.
నోరు పొడారిపోవడం, నాలుక పిడచకట్టుకుపోవడం, ఏడుస్తున్నా కన్నీళ్లు రాకపోవడం, మూత్రం రావడంలో ఇబ్బంది, చికాకుగా ఏడవడం, నిస్సత్తువ, విపరీతమైన కడుపునొప్పి, తలనొప్పితో పాటు, మెడ వంచలేకపోవడం, ఆకుపచ్చటి రంగులో వాంతులు, రక్తపువాంతులు, ఉంటే మాత్రం సీరియస్ గా తీసుకుని వైద్య సహాయం పొందటం మంచిది. కొందమంది చిన్నారుల్లో ఘన ఆహారం ఇవ్వడం ప్రారంభించిన తరువాత వాంతులు అవుతాయి. దీనికి కంగారు పడాల్సిన పనిలేదని వైద్యులు అంటున్నారు.
పాలు తాగేటప్పుడు గాలి ఎక్కువగా లోపలికి వెళ్లినా వాంతులు అవుతాయి. పాలు తాగేటప్పుడు పిల్లలు పాలతో పాటు కొంతగాలి కూడా మింగుతుంటారు. దీంతో తాగినపాలు బయటకి వస్తాయి. దీనిని వైద్యపరిభాషలో పొసెట్టింగ్ అంటారు. సాధారణ వాంతులతో బిడ్డ ఎదుగుదల బాగానే ఉంటే ఏ రకమైన చికిత్స అవసరం లేదన్నది వైద్యులు చెబుతున్నారు. వాంతులు ఎక్కువగా అవుతున్నా, శిశువు బరువు పెరగకుండా ఉన్నా ఆరోగ్యపరంగం సమస్యగా భావించి చికిత్స చేయించాల్సిన అవసరం ఉంటుంది. పాలు పట్టేటప్పుడు బాటిల్లో పాలు నిండుగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే శిశువు కడుపులోకి గాలి వెళ్లి పేగులపై భారాన్నిపెంచుతుంది. తల్లిపాలు పట్టిన తర్వాత భుజంపై పడుకోబెట్టుకుని, శిశువు వీపుపై తరచుగా చేతితో తట్టాలి. ఇందువల్ల మింగిన గాలి బయటకు వస్తుంది.