Relieves Mental Problems : మానసిక సమస్యల నుండి ఉపశమనం కలిగించే బార్లీ పాయసం! ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.

మానసిక వ్యాధి వల్ల ఎదుటి వాళ్లను అర్థ౦ చేసుకోలేక పోవడ౦, అ౦దరిలా ఉ౦డలేకపోవడ౦, రోజువారీ పనుల్ని చేసుకోలేకపోవడ౦ జరగవచ్చు. మానసిక వ్యాధులు మనలో ఉ౦డే బలహీనతల వల్ల రావు.

Barley Payas that relieves mental problems! Once you eat it, you will not leave it.

Relieves Mental Problems : భారత్‌లో ఏటా మానసిక సమస్యలతో సతమతమవుతున్నవారి సంఖ్య పెరుగుతుంది. ప్రతీ నలుగురిలో ఒకరు జీవిత౦లో ఎప్పుడో ఒకప్పుడు మానసిక వ్యాధితో బాధపడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. మానసిక వ్యాధుల్లో ఎక్కువమ౦దిలో కనిపి౦చేది డిప్రెషన్‌ అయితే ఎక్కువగా ఇబ్బ౦దిపెట్టే వ్యాధులు మాత్ర౦ ఇతరత్రా ఉన్నాయి. అవి స్కిట్సొఫ్రెనియా, బైపోలార్‌ డిజార్డర్‌ వంటి మానసిక వ్యాధులు. వీటితో చాలామ౦ది బాధపడుతున్నా వాటిని బయటకు చెప్పడ౦ లేదు, సరైన వైద్య సహాయ౦ అ౦దట్లేదు,ఈ రోజుల్లో సమస్యలు అంటే చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాయి. వాటిని తగ్గించుకోవటం చాలా కష్టం అయ్యిపోతుంది.

మానసిక వ్యాధి వల్ల ఎదుటి వాళ్లను అర్థ౦ చేసుకోలేక పోవడ౦, అ౦దరిలా ఉ౦డలేకపోవడ౦, రోజువారీ పనుల్ని చేసుకోలేకపోవడ౦ జరగవచ్చు. మానసిక వ్యాధులు మనలో ఉ౦డే బలహీనతల వల్ల రావు. వ్యాధి లక్షణాలు ఎ౦త కాల౦గా ఉన్నాయి, ఎ౦త ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక్కొక్కరి సమస్య, పరిస్థితిని బట్టి మారుతు౦ది. మానసిక ఒత్తిడి, ఆందోళ,న టెన్షన్, నీరసం వంటివి ఉన్నప్పుడు వాటి నుండి ఉపశమనం పొందటానికి కొన్ని రకాల చిట్కాలు బాగా ఉపకరిస్తాయి. వాటిల్లో ఒకటి బార్లీ పాయసం. మానసిక సమస్యలతో సతమతమౌతున్న వారు బార్లీతో తయారు చేసిన పాయసం తాగితే కొంతమేర దాని నుండి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు. దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం…

బార్లీతో పాయసం తయారుచేసే విధానం ;

అరకప్పు బార్లీని రాత్రి సమయంలో నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పొయ్యి మీద గిన్నె పెట్టి లీటర్ పాలను పోసి కొంచెం వేడి అయ్యాక నానబెట్టిన బార్లీని వేయాలి. బార్లీని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బార్లీ ఉడకటానికి దాదాపుగా 15 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత జీడిపప్పు,బాదం పప్పు,డేట్స్ లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా కలపాలి. ఉడికిన తరువాత పొయ్యిపై నుండి దించుకుని అందులో ఖర్జూరం ముక్కలు వేసుకోవాలి. ఖర్జూరం తీపి సరిపోతుంది. పంచదార వేయాల్సిన పనిలేదు. ఇలా తయారైన బార్లీ పాయసాన్ని వారంలో రెండు లేదా మూడు సార్లు తింటే ఎన్నో శారీరక,మానసిక సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పాయసాన్ని తినవచ్చు.

గమనిక: అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈసమాచారాన్ని అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.