Black Pepper : రోగనిరోధక శక్తి పెంచే నల్ల మిరియాల టీ..
ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు A, K, C, కాల్షియం, పొటాషియం, సోడియం వంటివి ఉంటాయి. థర్మోజెనిక్ ప్రభావం కారణంగా జీవక్రియలను వేగవంతం చేయడంలో నల్ల మిరియాలు సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
- Guntupalli Ramakrishna
- Published On : November 11, 2021 / 11:53 AM IST
Peppar Tea
Black Pepper : నల్ల మిరియాలను వంటకాలలో ఎక్కవగా ఉపయోగిస్తారు. ఇవి ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. నల్ల మిరియాలను నూనెను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే మిరియాలతో టీ తయారు చేసుకుని తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతాయి. ఇవి శరీరంలోని పోషకాలను గ్రహించడంలో కూడా సహాయపడుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నల్ల మిరియాలలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ టీ వల్ల కలిగే ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కలిగించే హానికరమైన ప్రభావాలను నివారించడంలో సహాయపడుతాయి. నల్ల మిరియాలలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి సూపర్‌ఫుడ్‌గా పనిచేస్తాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతాయి. ఇవి జీవక్రియలను పెంచడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు A, K, C, కాల్షియం, పొటాషియం, సోడియం వంటివి ఉంటాయి. థర్మోజెనిక్ ప్రభావం కారణంగా జీవక్రియలను వేగవంతం చేయడంలో నల్ల మిరియాలు సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో బరువు తగ్గుతారు. నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియలను మెరుగుపరుస్తుంది. కీళ్ళనొప్పులు, కాలానుగుణ అలెర్జీలు, ఆస్తమాతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపశమనాన్ని ఇస్తాయి. మిరియాలలోని పైపెరిన్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
మిరియాల టీ తయారు చేసే విధానం ;
1/4 టీ స్పూన్ నల్ల మిరియాలు, అల్లం చిన్న ముక్క, 1 టీస్పూన్ తేనె, 1 కప్పు నీరు, నిమ్మకాయ అవసరం. ఒక చిన్న పాత్ర తీసుకొని అందులో నీరు, నల్ల మిరియాల పొడి, తురిమిన అల్లం వేయాలి. నీటిని 5 నిమిషాలు మరిగించాలి. ఒక కప్పులో టీని వడకట్టి అందులో నిమ్మరసం, తేనె కలపాలి. ఇలా సిద్ధం చేసుకున్న మిరియాల టీ ని రోజుకో కప్పు తాగితే ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
