Weight Loss : బ్రౌన్ రైస్..రెడ్ రైస్…బరువు తగ్గేందుకు రెండింటిలో ఏది బెస్ట్?

బ్రౌన్ రైస్ అనేది తృణధాన్యం, పాలిష్ చేసిన తెల్ల బియ్యంతో పోలిస్తే ఇది అధిక పోషక విలువలను కలిగి ఉంటుందని బహ్ల్ చెప్పారు. కాబట్టి ఆరోగ్య దృక్కోణంలో చూస్తే బ్రౌన్ రైస్ ఖచ్చితంగా వైట్ రైస్ కంటే బెటర్ గానే చెప్పవచ్చు.

Brown Rice..red Rice

Weight Loss : మనిషికి ఉన్న సమస్యల్లో ప్రస్తుతం అతి ముఖ్యమైన సమస్య అధిక బరువు. చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ బరువు తగ్గేందుకు అనేక మంది సూచనలు, సలహాలను స్వీకరిస్తున్నారు. వారికి సూచనలు ఇచ్చేవారు పిండిపదార్ధాలు తగ్గించాలని ముఖ్యంగా బియ్యం అన్నాన్ని తినకూడదని ప్రధానంగా సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చని సలహాలు ఇస్తున్నారు. ఈ సలహాలు ఇచ్చేవారు ఎవరు చెప్పినా బియ్యాన్నే బరువు పెరగటానికి ఒక విలన్ గా చిత్రీకరించేస్తున్నారు.

వాస్తవానికి వైట్ రైస్ వదిలేయమని చెప్పటం మంచి సలహానే అయినప్పటికీ అదే సమయంలో బ్రౌన్ రైస్, రెడ్ రైస్ తీసుకోవటం వల్ల ఆరోగ్య పరంగా మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు ముఖ్యంగా ఈ బ్రౌన్ రైస్ , రెడ్ రైస్ ఈ రెండింటిలో ఏది ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల బరువు తగ్గటానికి అవకాశం ఉంటుందనే దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన పోషకాహార నిపుణుడు పారుల్ మల్హోత్రా బహ్ల్ బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఈ రెండిలో ఏది తినాలన్న విషయంపై అనేక మందిలో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.

బ్రౌన్ రైస్ అనేది తృణధాన్యం, పాలిష్ చేసిన తెల్ల బియ్యంతో పోలిస్తే ఇది అధిక పోషక విలువలను కలిగి ఉంటుందని బహ్ల్ చెప్పారు. కాబట్టి ఆరోగ్య దృక్కోణంలో చూస్తే బ్రౌన్ రైస్ ఖచ్చితంగా వైట్ రైస్ కంటే బెటర్ గానే చెప్పవచ్చు. మార్కెట్‌లో రకరకాల బ్రౌన్‌ రైస్‌ అందుబాటులో ఉన్నాయి. బియ్యం ఊకలో ఉండే రంగు అది ఏరకానికి చెందిన్నది నిర్ణయిస్తుంది. బ్రౌన్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి బ్రౌన్ రైస్‌లోని పోషక పదార్ధాలను మరింత మెరుగుపరుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే రెడ్ రైస్ కూడా ఒక తరహాలో ఉండే బ్రౌన్ రైస్ అనే చెప్పవచ్చు.

ఎరుపు బియ్యంలో మాంగనీస్ ఉంటుంది. కణజాలం, ఎముకల ఏర్పాటులో సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడం , సెక్స్ హార్మోన్లలో విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొవ్వు ,కార్బోహైడ్రేట్ జీవక్రియ, కాల్షియంను అందించటంతోపాటు రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడుతుంది.

బరువు తగ్గడానికి ఏది మంచిది?

అన్ని రకాల బియ్యం దాదాపు ఒకే విధమైన కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లను కలిగి ఉన్నాయని బహ్ల్ చెబుతున్నారు. బ్రౌన్ రైస్ , రెడ్ రైస్ రెండూ ఫైబర్ , న్యూట్రీషియన్ కంటెంట్‌లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. కాబట్టి, రెండూ ప్రయోజనకరంగా ఉంటాయి. రెడ్ రైస్ రుచి కరంగా ఉండటంతోపాటు అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. కొవ్వులను సమర్ధవంతంగా కరిగించేందుకు, శరీర జీవక్రియలకు బ్రౌన్ రైస్ , రెడ్ రైసై రెండు ఎంతగానో దోహదపడతాయని ఆమె చెబుతోంది.