Cold Water Bath : చన్నీటి స్నానంతో గుండెకు ముప్పేనా?
గుండె జబ్బులతో బాధపడుతున్నవారు సాద్యమైనంత వరకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. నీరు మరీ అంత వేడిగా కూడా ఉండకూడదు. ఇలాంటి వారు షవర్ల క్రింద స్నానం చేయటం చేయరాదు. చల్లనీటితో స్నానం చేయాలని పిస్తే ముందుగా కొద్ది మొత్తంలో గోరు వెచ్చని నీటిని శరీరంపై పోసుకున్న తరువాత చల్లనీటితో స్నానం చేయటం మంచిది.
- Guntupalli Ramakrishna
- Published On : July 27, 2022 / 02:37 PM IST
Heart
Cold Water Bath : చల్లని ఉష్ణోగ్రతలు మీ గుండె మరియు రక్తప్రసరణపై ముఖ్యమైన ప్రభావాలను చూపుతాయి. ప్రధానంగా చన్నీటి స్నానం వల్ల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రమాదమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. చల్లని నీటితో స్నానం చేయటం వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచించబడతాయి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది. చల్లని గాలి కన్నా, అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానం చేయటం వల్ల శరీరంపై ఎక్కవ ప్రభావం ఉంటుంది. చల్లని నీటితో స్నానం చేయటం వల్ల రక్తనాళాలపై భారం పడుతుంది.
చల్లని నీరు శరీరానికి తగిలిన సందర్భంలో ఒక్కసారిగా షాక్ తగిలిన భావన కలుగుతుంది. హార్ట్ బీట్ లో సైతం తేడా వస్తుంది. ముఖ్యంగా గుండెసమస్యలతో బాధపడేవారు చన్నీటి స్నానం చేయకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వేడి వాతావరణంలో, అకస్మాత్తుగా చన్నీటి స్నానం చేస్తే హార్ట్ ఎటాక్ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా శ్వాస ఆడకపోవడం, భయాందోళనలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.
హార్ట్ బీట్‌లో మార్పులు చోటు చేసుకుని గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. షవర్ బాత్ లు, వాటర్ ఫ్లో అధికంగా ఉండే స్నానాలు చేయటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. చల్లటి నీరు శరీరంపై ఒక్కసారిగా పడటం వల్ల న్యూరోజెనిక్ కార్డియో రెస్పిరేటరీ ప్రతిస్పందనలకు దారితీసి ఆప్రభావంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.
గుండె జబ్బులతో బాధపడుతున్నవారు సాద్యమైనంత వరకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. నీరు మరీ అంత వేడిగా కూడా ఉండకూడదు. ఇలాంటి వారు షవర్ల క్రింద స్నానం చేయటం చేయరాదు. చల్లనీటితో స్నానం చేయాలని పిస్తే ముందుగా కొద్ది మొత్తంలో గోరు వెచ్చని నీటిని శరీరంపై పోసుకున్న తరువాత చల్లనీటితో స్నానం చేయటం మంచిది.
గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించి వారి సూచనలు , సలహాలు తీసుకోవటం మంచిది.
