Safety Tips for Elevator : లిఫ్ట్ ఆగిపోతే కంగారు పడొద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు.

ఎక్కువ ఫ్లోర్లు ఎక్కాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ వాడతాం. కొన్ని టెక్నికల్ సమస్యలతో ఒక్కోసారి లిఫ్ట్ ఆగిపోతే గాభరా పడిపోతాం. రెగ్యులర్ లిఫ్ట్ వాడేవారు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి.

Safety Tips for Elevator

Safety Tips for Elevator : ఇంట్లో అయినా.. ఆఫీసులో అయినా ఎక్కడైనా లిఫ్ట్ ఎక్కినపుడు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. అలాంటి సమయాల్లో కంగారు పడిపోకూడదు. లిఫ్ట్‌ను ఉపయోగించేటపుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Boy Trapped Inside Lift : తల్లిదండ్రులూ బీ కేర్‌ఫుల్.. మీ పిల్లలను ఒంటరిగా లిఫ్ట్‌లో వదులుతున్నారా? ఎంత ప్రమాదమో చూడండి..

ఎక్కువ ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ ఎక్కేటపుడు ఖచ్చితంగా లిఫ్ట్‌ను ఉపయోగిస్తాం. కొంతమంది లిఫ్ట్ ఆగిలోపు కంగారుపడిపోతుంటారు. తలుపులు ఓపెన్ కాకముందే వారు బలవంతంగా తెరవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆటోమేటిక్ లిఫ్ట్‌కి అది తెరుచునేవరకూ వెయిట్ చేయాలి. లిఫ్ట్ దిగేటపుడు వృద్ధులు, పిల్లలు ముందుగా దిగడానికి అనుమతించాలి. ఎవరినీ నెట్టకుండా ఉండటం ముఖ్యం.

మీరు తరచుగా లిఫ్ట్‌ను ఉపయోగిస్తుంటే దాని కెపాసిటీ ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాని బరువు పరిమితులు లిఫ్ట్ లోపల లేదా బయట లేబుల్ మీద ముద్రిస్తారు. ఇళ్లలో ఉపయోగించే లిప్ట్‌లు, వ్యాపార సంస్థలు వాడే లిఫ్ట్‌లతో పోలిస్తే తక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి. లిఫ్ట్‌లో పరిమితికి మించి ఓవర్ లోడ్ అయితే కేబుల్స్ విరిగిపోయే ప్రమాదం ఉంది.

Stay Safe Online Campaign : స్టే సేఫ్ ఆన్‌లైన్ క్యాంపెయిన్.. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పక తెలుసుకోండి!

లిఫ్ట్‌లో ఉండే లైట్స్ గురించి తెలియకుండా ఆన్, ఆఫ్ చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే స్టాప్ బటన్‌ను ఉపయోగించాలి. లిఫ్ట్ సడెన్‌గా ఆగిపోతే కంగారు పడకూడదు. అలారం బటన్ నొక్కితే క్షణాల్లో సహాయం అందుతుంది. బలవంతంగా లిప్ట్ తలుపులు తెరవడానికి ప్రయత్నించకూడదు. అలాగే మూసుకుంటున్న లిఫ్ట్ తలుపులు కూడా చేతులతో ఆపడానికి ట్రై చేయకూడదు. లిఫ్ట్ సెన్సర్ పనిచేయకపోతే చేతులు తలుపుల మధ్య ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. లిఫ్ట్‌లో అత్యవసర పరిస్థితుల్లో సాయం పొందడానికి ఫోన్ ఉందో లేదో నిర్ధారించుకోండి. లిఫ్ట్‌లో ఉన్నప్పుడు ఊహించని పరిస్థితులు ఎదురైతే ఎలా బయటపడాలంటే మీరు వాడే లిఫ్ట్ గురించి ప్రతి ఒక్క అంశం ముందుగా తెలుసుకోవాల్సిందే.

పిల్లలతో లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారు బటన్లను ఆన్, ఆఫ్ చేస్తుంటే వారించాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలను లిఫ్ట్ ఒంటరిగా ఎక్కడానికి అనుమతి ఇవ్వకూడదు. లిఫ్ట్ ఎక్కినపుడు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి.

Phone to the washroom : టాయిలెట్‌కి సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?