Stay Safe Online Campaign : స్టే సేఫ్ ఆన్‌లైన్ క్యాంపెయిన్.. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పక తెలుసుకోండి!

Stay Safe Online Campaign : దేశ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగంపై ఆన్‌లైన్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటానికి పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో స్టే సేఫ్ ఆన్‌లైన్ వంటి ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

Stay Safe Online Campaign : స్టే సేఫ్ ఆన్‌లైన్ క్యాంపెయిన్.. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పక తెలుసుకోండి!

Stay Safe Online Campaign _ Indian Government Launches 'Stay Safe Online' Campaign Ahead of G20 Summit

Stay Safe Online Campaign : ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే.. ఏది కొనాలన్నా ఆర్డర్ చేయాలన్నా దాదాపు అన్ని పేమెంట్లు ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నారు. మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లు పేమెంట్ల దగ్గర నుంచి ఆన్‌లైన్ షాపింగ్‌ (Oneline Shopping)ల వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. ఇదే సైబర్ మోసగాళ్ల (Cyber Cheaters) పాలిట వరంగా మారింది. అమాయక వినియోగదారులను నమ్మించి అనేక సైబర్ మోసాలు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ మోసాలపై అవగాహన లేక అనేక మంది వినియోగదారులు సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు. ఫేక్ మెసేజ్‌లు (Fake SMS Scam), బ్యాంకు అలర్ట్ వంటి అనేక ఫేక్ లింకులను పంపుతూ వినియోగదారులను మోసగిస్తున్నారు.

డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లావాదేవీల విషయంలో కూడా చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల సైబర్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, SMS స్కామ్‌ల పేరుతో అనేక మోసాలకు తెగబడుతున్నారు. OTP, PIN, వంటి వ్యక్తిగత వివరాలను గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయడం ద్వారా బ్యాంకు అకౌంట్లలో నగదును కాజేస్తున్నారు. ఇలాంటి సైబర్ మోసాల విషయంలో ఆన్‌లైన్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.. ఇప్పటికీ చాలామంది వినియోగదారులకు ఇలాంటి మోసాల పట్ల అవగాహన లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

Read Also : Scammers Fraud Messages : ఈ బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. స్కామర్లతో జాగ్రత్త.. మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖతమే..!

అందుకే, ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాల బారినపడకుండా ఉండాలంటే ప్రతిఒక్కరికి తప్పనిసరిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లో సురక్షితమైన లావాదేవీలను జరపాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలిసి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాల్లోని వినియోగదారులు ఆన్‌లైన్‌లో (Stay Safe Online) ఉండేందుకు ఎలాంటి భద్రత చర్యలను పాటించాలి అనేదానిపై భారత ప్రభుత్వం స్టే సేఫ్ ఆన్ లైన్ (Stay Safe Online) పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఇప్పటికే G20 సన్నాహక సమావేశాల్లో భాగంగా కేంద్ర సమాచార శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ G20 గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ప్రోగ్రామ్ అండ్ స్టే సేఫ్ ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. దేశ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగంపై ఆన్‌లైన్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటానికి పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో స్టే సేఫ్ ఆన్‌లైన్ వంటి ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

Stay Safe Online Campaign _ Indian Government Launches 'Stay Safe Online' Campaign Ahead of G20 Summit

Stay Safe Online Campaign _ Indian Government Launches ‘Stay Safe Online’ Campaign

సెప్టెంబర్‌లో న్యూఢిల్లీ వేదికగా G-20 సదస్సు :
గతంలో ఇండోనేసియాలో జరిగిన G-20 సదస్సులో అధ్యక్ష బాధ్యతలను భారత్‌ స్వీకరించింది. డిసెంబర్ 1, 2022 నుంచి 30 నవంబర్ 2023 వరకు ఏడాది పాటు భారత్ G20 అధ్యక్ష పదవిని కొనసాగించనుంది. G20లో 19 దేశాలు (అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్ (EU) ఉన్నాయి. అన్ని దేశాలు సమిష్టిగా, G20 ప్రపంచ GDPలో 85శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయి.

భారత్‌లో సెప్టెంబర్‌‌లో (9-10) తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా G20 18వ సదస్సు జరుగనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. G20 – 2023 సదస్సును విజయవంతం చేసేందుకు కేంద్రం అనేక వ్యూహాలను రచిస్తోంది. దేశంలోని 56 నగరాలు, పట్టణాలలో మొత్తం వివిధ అంశాలకు సంబంధించి 200 సదస్సులను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీగా మారేందుకు భారత్ గణనీయమైన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం ఆన్‌లైన్ రిస్క్, భద్రతా చర్యల గురించి అన్ని వయస్సుల వినియోగదారులను చైతన్యపరచడంలో దృష్టి పెడుతుంది. తద్వారా పౌరుల సైబర్ భద్రతను బలోపేతం చేస్తోంది. పిల్లలు, విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు మొదలైన వారిపై ప్రత్యేక దృష్టి సారించే గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిగిన అన్ని వయస్సుల పౌరులు స్టే సేఫ్ ఆన్ లైన్ ప్రచారంలో పాల్గొనాలని ఆహ్వానిస్తోంది.

ఇందులో పాల్గొనే వారికి సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్ క్విజ్ (Cyber Hygiene Practices Quiz), సురక్షితమైన ఆన్ లైన్ సైబర్ భద్రతా ప్రతిజ్ఞ (Cyber Security Pledge to build safe online environment), డ్రాయింగ్ పెయింటింగ్, కార్టూన్ స్టోరీబోర్డ్ (Cartoon storyboard), షార్ట్ వీడియోలు, రియల్ లైఫ్ సైబర్, క్విజ్ కాంపిటీషన్స్, రీల్స్ / షార్ట్స్, స్టోగాన్ రైటింగ్ కాంపిటీషన్ వంటి యాక్టివిటీస్‌లో పాల్గొని అవగాహన పెంచుకోవచ్చు. ఆసక్తిగల ఆన్‌లైన్ యూజర్లు ఈ లింక్ (Stay Safe Online – Participate Now ) ద్వారా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు..

Read Also : Clear Premium Water : ‘క్లియర్ ప్రీమియం వాటర్’ బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్