Scammers Fraud Messages : ఈ బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. స్కామర్లతో జాగ్రత్త.. మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖతమే..!

Scammers Fraud Messages : సైబర్ మోసాల కేసులు అధిక స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రతిరోజూ సైబర్ సెల్‌లలో బ్యాంకింగ్ లేదా డిజిటల్ చెల్లింపు మోసానికి సంబంధించిన వేలాది కేసులు నమోదవుతున్నాయి.

Scammers Fraud Messages : ఈ బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. స్కామర్లతో జాగ్రత్త.. మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖతమే..!

Beware! Scammers sending fraud messages to HDFC customers, do not click on the link

Updated On : March 2, 2023 / 10:26 PM IST

Scammers Fraud Messages : సైబర్ మోసాల కేసులు అధిక స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రతిరోజూ సైబర్ సెల్‌లలో బ్యాంకింగ్ లేదా డిజిటల్ చెల్లింపు మోసానికి సంబంధించిన వేలాది కేసులు నమోదవుతున్నాయి. Statistica నివేదిక ప్రకారం.. 2021లో భారత్ అంతటా 4.8 వేలకు పైగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు నమోదయ్యాయి. కార్డ్/ఇంటర్నెట్- ATM/డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కేటగిరీ కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 128 కోట్ల మంది చేరారు. స్కామర్‌లు వినియోగదారుల డబ్బులను దొంగిలించడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు.

స్కామర్‌లు ప్రజలను మోసగించే అత్యంత సాధారణ మార్గాలలో ఫిషింగ్ (SMS) ఒకటి. ముఖ్యంగా ఫిషింగ్ ఫ్రాడ్ అనేది బ్యాంక్ SMS ద్వారా సైబర్ మోసగాళ్లు వారి బ్యాంక్ అకౌంట్ సస్పెండ్ అయిందని SMSకి యాడ్ చేసిన లింక్‌పై క్లిక్ చేయమని అడుగుతారు. తద్వారా KYC లేదా PANని అప్‌డేట్ చేయమని నమ్మిస్తారు. అయితే, ఎవరైనా ఆ SMSని చూసి నమ్మి ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత వారి ఫోన్ హ్యాక్ అవుతుంది. అలా యూజర్లు తమ డబ్బును కోల్పోతారు. ఫిషింగ్ SMS మోసం చాలా సాధారణంగా ఉంటుంది. అనేక బ్యాంకులు కూడా అలాంటి SMSలను నమ్మవద్దని హెచ్చరిస్తున్నాయి.

ఇటీవల, HDFC కూడా అలాంటి ఫ్రాడ్ గురించి తమ కస్టమర్‌లను అలర్ట్ చేసింది. బ్యాంకు కస్టమర్లకు తమ మొబైల్ ఫోన్‌లో వైరల్ అవుతున్న HDFC బ్యాంక్ SMS గురించి హెచ్చరిస్తోంది. ఇలాంటి ఫిషింగ్ SMS విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. HDFC కస్టమర్ మీ HDFC NET బ్యాంకింగ్ ఈరోజు సస్పెండ్ అవుతుంది. దయచేసి మీ PAN కార్డ్‌ని అప్‌డేట్ చేయండి. ఇప్పుడు లింక్ కింద విజిట్ చేయండి’ అని మెసేజ్‌‌తో పాటు ఒక లింక్ ఉంటుంది. మరొక యూజర్ ఈ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చారు. అతని KYCని అప్‌డేట్ చేయమని అడిగారు.

Read Also : QR Code Scam : QR కోడ్ స్కామ్‌తో తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి స్కామర్ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి? ఎలా గుర్తించాలో తెలుసా?

అతను అందుకున్న SMS ఇలా ఉంది, ‘డియర్ కస్టమర్ మీ HDFC అకౌంట్ ఈరోజు హోల్డ్ అవుతుంది. దయచేసి మీ KYCని వెంటనే అప్‌డేట్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఫిషింగ్ స్కామ్ గురించి వారిని హెచ్చరిస్తోంది. ఇలాంటి మెసేజ్‌లపై HDFC బ్యాంక్ కేర్ ట్వీట్‌లకు రిప్లయ్ ఇచ్చింది. HDFC కస్టమర్లు పాన్ కార్డ్ / KYC అప్‌డేట్ లేదా ఏదైనా ఇతర బ్యాంకింగ్ సమాచారం కోసం అడిగే తెలియని నంబర్‌లకు ప్రతిస్పందించవద్దని అభ్యర్థిస్తున్నామని తెలిపింది. అధికారిక ID hdfcbk / hdfcbn మాదిరిగానే ఈ మెసేజ్‌లలో లింక్‌లు ఎల్లప్పుడూ http://hdfcbk.io కింద ఉంటాయి. ఇలాంటి లింకులను నమ్మొద్దు. బ్యాంక్ ఎప్పటికీ PAN వివరాలు, OTP, UPI, VPA / MPIN, కస్టమర్ ID & పాస్‌వర్డ్, కార్డ్ నంబర్, ATM పిన్ & CVV కోసం అడగదని గమనించాలి. దయచేసి మీ రహాస్య వివరాలను ఎవరితోనైనా షేర్ చేయవద్దు. ఈ ఫిషింగ్ SMS లింక్‌లు ఏంటి? బ్యాంకు మోసాల నుంచి ఎలా నిరోధించవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..

Beware! Scammers sending fraud messages to HDFC customers, do not click on the link

Beware! Scammers sending fraud messages to HDFC customers, do not click on the link

ఫిషింగ్ బ్యాంక్ SMS స్కామ్ అంటే ఏంటి? :
ఫిషింగ్ SMSకు సంబంధించిన సాధారణ బ్యాంకింగ్ మోసాలలో స్కామర్‌లు బ్యాంకుల వలె ఫేక్ మెసేజ్ పంపుతారు. మీ అకౌంట్ వివరాలు, OTPలు, గుర్తింపు సంఖ్యల వంటి వ్యక్తిగత సమాచారం కోసం బ్యాంకు వినియోగదారులను అడుగుతారు. మీ బ్యాంకు అకౌంట్లను యాక్టివేట్ చేసే సాకుతో KYC లేదా PANని అప్‌డేట్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయమని అడుగుతారు. అయితే, ఎవరైనా అలాంటి లింక్‌లపై క్లిక్ చేసిన వెంటనే ఈ SMS ద్వారా స్కామర్‌లు వారి మొబైల్ లేదా బ్యాంక్ ఆధారాలకు రిమోట్ యాక్సెస్ పొందుతారు. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసేందుకు ఉపయోగిస్తారు.

ముఖ్యంగా, చట్టబద్ధమైన బ్యాంకులు సున్నితమైన ఆధారాలను షేర్ చేయమని లేదా అయాచిత మెసేజ్‌లను పంపమని మిమ్మల్ని ఎప్పుడూ అడగవు. ఫిషింగ్ SMS లేదా అభ్యర్థనకు ఎప్పుడూ ప్రతిస్పందించవద్దు. ముఖ్యంగా, మీ అకౌంట్ నంబర్, కార్డ్ నంబర్, OTP, CVV లేదా వ్యక్తిగత IDల వంటి సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు. PAN కార్డ్‌లు, KYCకి సంబంధించిన SMSలు సర్వసాధారణంగా వస్తుంటాయి. బ్యాంకింగ్ మోసాల నుంచి సురక్షితంగా ఉండటానికి మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.

ఫిషింగ్ బ్యాంక్ SMS స్కామ్ నుంచి ఎలా సురక్షితంగా ఉండాలంటే? :
– OTP, బ్యాంక్ వివరాలు, మొబైల్ నంబర్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని SMS లేదా అన్‌నౌన్ కాల్‌లో ఎప్పుడూ షేర్ చేయవద్దు.
– మీ UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ ఫోన్ ఎల్లప్పుడూ స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉంచండి. అదనంగా, మీ పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మార్చండి.
– ఏదైనా SMS అభ్యర్థనపై ఏదైనా చర్య తీసుకునే ముందు పంపినవారిని ఎల్లప్పుడూ ధృవీకరించండి.
– బ్యాంక్ హెచ్చరికల విషయంలో బ్యాంక్ మేనేజర్‌ని సంప్రదించండి లేదా అలాంటి SMS రిపోర్ట్ చేయండి.
– ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ప్రారంభించండి.
– మీరు మీ అకౌంట్ యాక్సెస్ చేసిన ప్రతిసారీ మీరు మీ పాస్‌వర్డ్, OTPని ఎంటర్ చేయాలి.
– అపరిచిత వ్యక్తుల ధృవీకరణ కోసం మీరు మీ బయోమెట్రిక్‌లను ఫింగర్ ఫ్రింట్ వంటి సెకండ్ పాస్‌వర్డ్‌గా కూడా సెట్ చేయవచ్చు.
– పంపిన ఫ్రాడ్ SMSలో, సురక్షితమైన లింక్, ఇంగ్లీష్ భాష సరిగా ఉందో లేదో కూడా చెక్ చేయొచ్చు.
– అలాంటి వివరాల కోసం ఎల్లప్పుడూ చెక్ చేయండి. మీకు అలాంటి SMS వస్తే వెంటనే మీ ఫోన్లో నుంచి డిలీట్ చేయండి.

Read Also : WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్