Clear Premium Water : ‘క్లియర్ ప్రీమియం వాటర్’ బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్
Clear Premium Water : ప్రముఖ భారతీయ ప్రీమియం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీ క్లియర్ ప్రీమియం వాటర్ ప్యూరెస్ట్ క్వాలిటీ వాటర్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది.

Clear Premium Water signs superstar Hrithik Roshan as brand ambassador
Clear Premium Water : ప్రముఖ భారతీయ ప్రీమియం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీ క్లియర్ ప్రీమియం వాటర్ (Clear Premium Water) ప్యూరెస్ట్ క్వాలిటీ వాటర్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. కంపెనీ ప్రమోషన్లలో భాగంగా క్లియర్ తమ ప్రొడక్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan)ను నియమించుకుంది. దేశ్ కి క్లియర్ అనే నినాదంతో క్వాలిటీకి పెద్దపీట వేస్తూ ఈ సరికొత్త బ్రాండ్ తీసుకొస్తోంది. ఈ మేరకు క్లియర్ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. క్లియర్ తన మార్కెట్‌ను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.
హృతిక్ రోషన్ ద్వారా తమ ప్రొడక్టుకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. CLEAR #DeshKiClearChoice అనే నినాదంతో ఈ మిషన్ ప్రారంభించినట్టు తెలిపింది. ఈ సందర్భంగా క్లియర్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ నయన్ షా మాట్లాడుతూ.. హృతిక్ రోషన్‌తో అనుబంధం ద్వారా క్లియర్ ప్రీమియం వాటర్ కంపెనీ ప్రముఖ బ్రాండ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.
దేశ ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన నీటిని అందించే ప్రయత్నంలో హృతిక్ రోషన్ బాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందని కంపెనీ సీఈఓ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకే పెద్దపీట వేస్తూ తమ ప్రొడక్టులను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అసోసియేషన్ గురించి సూపర్ స్టార్ హృతిర్ రోషన్ మాట్లాడుతూ.. ఎంతో సురక్షితమైన, మినరల్-రిచ్ వాటర్ అందించే ప్రీమియం వాటర్ బ్రాండ్ (CLEAR)తో కలిసి ముందడుగు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్లియర్ సంస్థ ఇప్పటికే జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా గుర్తింపు సాధించిందని తెలిపారు.

Clear Premium Water signs superstar Hrithik Roshan as brand ambassador
పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్న క్లియర్ కంపెనీ చాలా ఏళ్లుగా అనేక ప్రొడక్టులను అందిస్తుందని చెప్పారు. హృతిక్ రోషన్ అభిమానులు కూడా తమ నీటిని కూడా అభిమానిస్తారని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ అభిప్రాయపడ్డారు. సెంట్రల్ గుజరాత్‌లో పాన్ ఇండియా ఉనికిని కలిగిన క్లియర్ అతిపెద్ద బాట్లింగ్ ప్లాంట్‌ను కలిగి ఉంది.
దేశవ్యాప్తంగా క్లియర్ కంపెనీ ఇక్కడి నుంచే నీటిని అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. జాతీయ విమానయాన సంస్థలు, ప్రముఖ హోటల్‌లు, ప్రొడక్షన్ హౌస్‌లు, ఆటోమొబైల్స్‌తో సహా అనేక పరిశ్రమలకు సేవలందించడంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉందన్నారు. 200 ml, 500 ml, 1 లీటర్, 2 లీటర్లు, 5 లీటర్లతో సహా అనేక రకాల సైజుల్లో వాటర్ బాటిళ్లను అందిస్తున్నామని తెలిపారు.