Coriander : రక్తపోటును నియంత్రించే కొత్తిమీర!
కొత్తి మీర ఆకులు మెదడు పనితీరును మెరుగు పర్చటంలో సహాయపడతాయి. కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను నివారించటంలో తోడ్పడుతుంది. కొత్తిమీర రసం తాగితే పొట్ట శుభ్రపడుతుంది. కడుపులో వచ్చే క్యాన్సర్‌ను రాకుండా నియంత్రించటంలో తోడ్పడుతుంది. నోటి పుండ్లు, నోటి దుర్వాసన ఉన్నవారు కొత్తిమీర తినడం మంచిది.
- Guntupalli Ramakrishna
- Published On : July 30, 2022 / 05:54 PM IST
Blood Pressure
Coriander : భారతీయుల వంటకాల్లో విరివిగా ఉపయోగించే కొత్తిమీర ఆకుల్లో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మంచి సువాసన కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరుగా చెప్పవచ్చు. మూత్రంలోని టాక్సిన్స్ ను క్లీన్ చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలో పేరుకునే అనవసర కొవ్వులను కరిగించి శరీర బరువును అదుపులో ఉంచుతుంది.
కొత్తి మీర ఆకులు మెదడు పనితీరును మెరుగు పర్చటంలో సహాయపడతాయి. కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను నివారించటంలో తోడ్పడుతుంది. కొత్తిమీర రసం తాగితే పొట్ట శుభ్రపడుతుంది. కడుపులో వచ్చే క్యాన్సర్‌ను రాకుండా నియంత్రించటంలో తోడ్పడుతుంది. నోటి పుండ్లు, నోటి దుర్వాసన ఉన్నవారు కొత్తిమీర తినడం మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ సెప్టిక్ మాలిక్యూల్స్ సమస్యలను తొలగిస్తాయి.
కొత్తిమీర కంటి చూపును పదునుపెడుతుంది. కంటి ఆరోగ్యానికి మంచిది.రుతుక్రమం ఆగిన స్త్రీలకు కొత్తిమీర మంచిది. రక్త ప్రవాహాన్ని సజావుగా సక్రియం చేయడంలో వారికి సహాయపడుతుంది. రక్తహీనతను కొంతవరకు నయం చేస్తుంది. కొత్తిమీర మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
కొత్తిమీర ఆకులను వివిధ రూపాల్లో తీసుకోవటం వల్ల రక్తపోటుతో బాధపడుతున్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తపోటు స్ధాయిలను తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. గుండె పోటు వంటి హృదయనాళ సమస్యలను తగ్గించటంలో తోడ్పడుతుంది.
