Covaxin 3rd Trial Data : కొవాగ్జిన్ సామర్థ్యం 77.8శాతం.. టీకాపై అనుమానాలకు చెక్ పడినట్టేనా!

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాపై 77.8 శాతం సమర్థంతవంతగా పోరాడగలదని రుజువైంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Covaxin 3rd Trial Data : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాపై 77.8 శాతం సమర్థంతవంతగా పోరాడగలదని రుజువైంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూడో దశ ట్రయల్ ఫలితాలను నేషనల్ డ్రగ్ రెగ్యులేటర్ కు వచ్చేవారంలో సమర్పించనున్నారు. ప్రస్తుతానికి ఈ ట్రయల్ డేటాను అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. ఇంకా దీనిపై పీర్ రివ్యూ చేయాల్సి ఉంది. ఈ నెల ప్రారంభంలోనే తయారీదారు భారత్ బయోటెక్ ట్రయల్ డేటాను డ్రగ్ రెగ్యులేటర్ కు ప్రచురించనున్నట్టు పేర్కొంది.

అది దాదాపు మూడు నెలల సమయం పట్టొచ్చునని తెలిపింది. ప్రాథమిక ట్రయల్ డేటా విశ్లేషణ ప్రకారం.. మూడో దశ ట్రయల్స్ డేటా మార్చిలో ప్రచురించారు. రెండో డోసు పూర్తి అయిన వారిలో 81 శాతం సామర్థ్యంతో కరోనాను ఎదుర్కోగలదని రుజువైంది. అంతేకాదు.. ఆస్పత్రిలో చేరాల్సిన అవకాశాలను కూడా 100 శాతం తగ్గించినట్టు డేటా వెల్లడించింది. గత ఏడాదిలో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. అయితే ఇప్పటికీ క్లినికల్ ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి.

ప్రజా ఆరోగ్యం దృష్ట్యా అత్యవసర వినియోగానికి మాత్రమే అనుమతినిచ్చారు. అయినప్పటికీ ఈ టీకాపై అనేక అనుమానాలు, అపోహలు నెలకొన్నాయి.. కోవాగ్జిన్ తుది దశ మూడో ట్రయల్ డేటా ఫలితాలతో టీకా సామర్థ్యంపై అనుమానాలు తొలిగిపోతాయో లేదో చూడాలి. మరోవైపు… దేశవ్యాప్తంగా కరనా వ్యాక్సినేషన్ పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ట్రెండింగ్ వార్తలు