Mother and Son Viral Video : మేకప్ వేసుకున్న తల్లిని గుర్తుపట్టని చిన్నారి.. గుక్కపెట్టి ఏడుపు.. వైరల్ అవుతున్న వీడియో
మేకప్ వేసుకుంటే తల్లిని కొడుకు గుర్తుపట్టలేకపోవడం ఏంటి? అవును ఓ చిన్నారి మేకప్ వేసుకున్న తల్లిని గుర్తుపట్టక ఏడుస్తాడు. తన తల్లిని తెచ్చి ఇమ్మని అడుగుతాడు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో నవ్వు తెప్పిస్తోంది.
- Lakshmi 10tv
- Published On : June 1, 2023 / 04:26 PM IST
Viral Video
Viral Video : ఇంటర్నెట్ లో నవ్వు తెప్పించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మేకప్ వేసుకున్న తల్లిని గుర్తు పట్టక ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తాడు. మేకప్ మహత్యం అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
Dosha video goes viral : ‘ఆహారాన్ని వృధా చేయడం మానేయండి’ వైరల్ వీడియోలు చూసి మండిపడుతున్న నెటిజన్లు
visagesalon1 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో అందరినీ కడుపుబ్బా నవ్వు తెప్పిస్తోంది.. మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీడియోలో అందమైన మేకప్ మరియు హెయిర్ స్టైల్‌తో నీలంరంగు లెహంగా వేసుకుని ఓ మహిళను చూసి చిన్నారి ఏడ్వడం మొదలుపెడతాడు. మేకప్‌లో ఉన్న తన తల్లిని గుర్తుపట్టలేకపోతాడు.
ఆమె దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుంటే గుక్కపెట్టి ఏడుస్తాడు. అంతేకాదు తన తల్లిని తనకు ఇమ్మని అడుగుతాడు. నేనే మమ్మీని అని బాలుడికి చెబుతున్నా నువ్వు నా మమ్మీవి కాదు అంటాడు. చివరకి పిల్లవాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె అతడిని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తుంది. అయినా ఆమెను గుర్తించడు. ఈ వీడియో 22.8 మిలియన్ వ్యూస్ సంపాదించింది.
Mount Everest : ఎవరెస్టు శిఖరమా? డంపింగ్ యార్డా? .. ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసిన వీడియో వైరల్
వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ‘మేకప్ చాలా ప్రమాదకరమైనదని’ ..’మేజిక్ ఆఫ్ మేకప్’ అని అభిప్రాయపడ్డారు. మునుపెన్నడూ తల్లిని మేకప్‌లో చూసి ఉండకపోవడం వల్ల చిన్నారి గుర్తుపట్టకపోయి ఉండవచ్చని
నవ్వుకున్నారు.
