Look Slim : ఈ చిట్కాలు పాటిస్తే సన్నాగా, నాజుకుగా కనిపిస్తారు తెలుసా!

భోజన సమయంలో కాకుండా మధ్యమధ్యలో ఆకలి అనిపిస్తే తినటం చేయొద్దు. కొవ్వు తక్కువగా ఉండే పదార్ధాలనే తినాలి. నూనెలో తయారైన వేపుళ్లు తినటం తగ్గించాలి. తినకపోవటమే మంచిది. పులుసు కూరలు తినండి.

Slim And Delicate

Look Slim : సన్నగా, నాజుకుగా కనిపించాలని చాలా మంది కోరుకుంటుంటారు. లావుగా ఉన్నవారు తాము బరువు తగ్గి సన్నగా కనిపించాలని ఆశయంగా పెట్టుకుంటారు. ఇందుకోసం రకరకాల పద్దతులను అనుసరిస్తుంటారు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటుంటారు. అయితే ఇది ఒకరోజులో సాధించటం సాద్యం అయ్యే పనికాదు. రోజు వారిగా ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేస్తూ క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనే సాధ్యమవుతుంది. సన్నగా, నాజుకుగా మారాలనుకునే వారికి కొన్ని చిట్కాలు ఎంతగానో దోహదం చేస్తాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

భోజనం చేయాలనుకున్నప్పుడు తినేందుకు చిన్ని సైజు ప్లేటున ఎంచుకోవాలి. దీని వల్ల తక్కువ మొత్తం తినేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోకూడదు. కడుపు నిండిందనే భావన రావటానికి ముందే తినటం మానేయాలి. ఒకేసారి బరువు తగ్గాలనే తెలివితక్కువ ఆలోచన చేయోద్దు. వారానికి అరకిలో లేదంటే కిలో తగ్గితే చాలు అంతకన్నా బరువు తగ్గటం శ్రేయస్కరం కాదు.

భోజన సమయంలో కాకుండా మధ్యమధ్యలో ఆకలి అనిపిస్తే తినటం చేయొద్దు. కొవ్వు తక్కువగా ఉండే పదార్ధాలనే తినాలి. నూనెలో తయారైన వేపుళ్లు తినటం తగ్గించాలి. తినకపోవటమే మంచిది. పులుసు కూరలు తినండి. బిస్కెట్లు, కేకులు వంటివి తీసుకోవద్దు. అలసత్వంగా ఆహార నిబంధనల్లో ఏమాత్రం మార్పులు చేయవద్దు. ఉదయం నిద్రలేవగానే పరగడపున రెండు గ్లాసుల మంచి నీరు సేవించాలి. భోజనానికి ముందు క్యారెట్, క్యాబేజి వంటి వాటిని చిన్నచిన్న ముక్కలుగా కోసుకుని తీసుకోండి.

పీచు ఉండే పదార్ధాలను ఎక్కువగా తీసుకోండి. పళ్లు, పచ్చికూరగాలు తినటం మేలు. ఎందుకంటే వీటిని తీసుకోవటం వల్ల లావుగా మారే సమస్య ఉండదు. ప్రతి వారం బరువును చెక్ చేసుకుని దానిని నమోదు చేసుకోండి. ఇతర సమయాల్లో బాగా ఆకలి అనిపిస్తే ఆపిల్ పండు కాని లేదంటే పల్చని మజ్జిగ కాని తీసుకోండి. ఇలాంటి చిట్కాలు పాటించటం వల్ల త్వరగా బరువు తగ్గి సన్నగా, నాజుకుగా కనిపించాలన్న కోరిక త్వరగా తీరుతుంది.