Sugar Levels : అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ పడిపోతే ఏంచేయాలో తెలుసా?

షుగర్‌ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవల్స్ ఎప్పుడైతే పూర్తిగా తగ్గిపోతాయో ఆ సమయంలో అవయవాలు పని చేయవు. కొన్ని గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Do you know what to do if your sugar levels suddenly drop?

Sugar Levels : గుండె జబ్బులు, దృష్టి కోల్పోవడం, మూత్రపిండాల వ్యాధి వంటి దీర్ఘకాలిక, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను సాధ్యమైనంతవరకు నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. నియంత్రణలోలో ఉండటం వల్ల శక్తిని మరియు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. షుగర్‌ కాస్త ఎక్కువ ఉన్నా పర్వాలేదు కాని షుగర్ లెవల్స్ పడిపోతే మాత్రం అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. షుగర్‌ లెవల్స్ పడిపోవడం వల్ల ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. షుగర్‌ లెవల్స్ పడిపోయిన సమయంలో పక్కన ఎవరు లేకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. షుగర్‌ లెవల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకుంటే రెగ్యులర్ గా అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

రక్తంలో చక్కెరను ఎప్పుడు తనిఖీ చేయాలి?

రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి గ్లూకోజ్ మానిటర్ని ఉపయోగించాలి. ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని కొలుస్తుంది. రక్తంలో చక్కెరను ఎంత తరచుగా తనిఖీ చేస్తారు అనేది మీకు ఉన్న మధుమేహం రకం మరియు ఏదైనా మధుమేహం మందులు తీసుకుంటుంటే దానిపై ఆధారపడి ఉంటుంది. రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి సాధారణ సమయాల విషయానికి వస్తే ఉదయం నిద్ర మేల్కొనతరువాత, తినడానికి తాగటానికి ముందుగా చెక్ చేసుకోవాలి. భోజనం చేసిన రెండు గంటల తరువాత, నిద్రకు ఉపక్రమించ బోయే ముందుగా తనిఖీ చేసుకోవాలి.

షుగర్‌ లెవల్స్ ను తగ్గించుకునేందుకు చాలా మంది ఇన్సులిన్‌ వాడుతూ ఉంటారు. అది ఇంజక్షన్‌ లేదా ట్యాబ్లెట్‌ రూపంలో ఉంటుంది. ప్రతి రోజు ఒకే డోసు ఇన్సులిన్ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. అలా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాని కొన్ని సార్లు తీసుకునే ఆహారం , ఇతర కారణాల వల్ల సహజంగానే షుగర్ నార్మల్‌ స్టేజీకి వస్తుంది. ఆ విషయం తెలియని వారు ఎప్పటిలాగే ఇన్సులిన్‌ వేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ మరింతగా పడిపోవచ్చు. మందుల డోసు పెరిగినా షుగర్ స్ధాయిలు పూర్తి స్ధాయిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆసందర్భంలో కళ్లు తిరిగి పడిపోవడం, తల తిరగడం వంటివి జరుగుతాయి. ఆ సమయంలోనే కాస్త నోట్లో చెక్కర వంటి తీపి పదార్థం వేయడం వల్ల మళ్లీ షుగర్‌ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

షుగర్‌ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవల్స్ ఎప్పుడైతే పూర్తిగా తగ్గిపోతాయో ఆ సమయంలో అవయవాలు పని చేయవు. కొన్ని గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్‌ లెవల్స్ పడి పోయినట్లు గా వ్యాధిగ్రస్తులకు కొన్ని సార్లు తెలిసే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు వారికి కూడా తెలియకుండా ఒక్కసారిగా షుగర్‌ లెవల్స్ పడిపోతాయి. దాంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. బ్లడ్ షుగర్ స్ధాయిల వివరాలకు సంబంధించి భోజనానికి ముందు 80 నుండి 130 mg/dL., భోజనం తిన్న రెండు గంటల తర్వాత: 180 mg/dL కంటే తక్కువగా షుగర్ స్ధాయిలు ఉండాలి. వయస్సు, ఇతర ఆరోగ్య సమస్యలు ఇతర కారకాలపై ఆధారపడి మీ రక్తంలో చక్కెర స్ధాయిలు భిన్నంగా ఉండవచ్చు.

నిపుణులు ఏం చెబుతున్నారు ;

ప్రతి రోజు తినే ఆహారం మాత్రమే తీసుకోవాలి. క్రమం తప్పకుండా వారంకు కనీసం ఒక్క సారి షుగర్ లెవల్స్‌ టెస్టు చేయించుకోవాలి ఎప్పుడైతే షుగర్‌ లెవల్స్ పడిపోతాయో అప్పుడు ఇంజక్షన్‌ కు బదులుగా చక్కెర ను ఇవ్వాల్సి ఉంటుంది. చక్కెరతో పాటు ఆ సమయంలో కాస్త ఎనర్జీ బూస్టింగ్‌ కు మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్‌ ను తీసుకోవాలి. కాస్త కుదుట పడ్డ తర్వాత తేలికపాటి ఆహారాన్నితీసుకోవాలి. పండ్లను తినడం ద్వారా మళ్లీ షుగర్ లెవల్స్ నార్మల్‌ కు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క షుగర్‌ పేషంట్‌ కూడా తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు