Processed With Vsco With A9 Preset
Coffee : చాలా మందికి ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగటం అలవాటు. కొంత మందికి అదిలేకుంటే రోజు గడవదు. కాఫీలోని కెఫిన్ వల్ల కొంత ఉత్తేజం కలిగే మాట వాస్తవమే. కెఫిన్ లోని బీటా ఆక్సిడేషన్ క్రియ వల్ల కొవ్వు కూడా కరిగే విషయమూ నిజమే. పరుగు పందెంలో పాల్గొనాలనుకునే వారు కొవ్వు, బరువు తగ్గించుకోవటానికి కాఫీని ఎక్కువగా తాగేస్తుంటారు. ఇలా చేయటం ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీని వల్ల గుండె స్పందనల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది.
శరీరం ఎక్కువగా ఉత్తేజం పొందేలా చేయటం వల్ల మెదడు తీవ్రంగా అలసిపోయే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో దీని వల్ల ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. శరీరం ఉత్తేజం పొందటానికి, బరువు తగ్గేందుకు కాఫీని తాగటం సరైంది కాదు. కాఫీలోని కెఫిన్ కంటే టీలోని ఎల్ థయనైన్ కొంతమేర మేలు చేస్తుంది. ఇది యాంగ్జైటీని తగ్గిస్తుంది. అయితే కాఫీ కాని, టీ కాని రోజుకు రెండు కప్పుల కంటే మించి తాగ కూడదని గుర్తుంచుకోవాలి.