Chiku Fruit : సపోటాలు తింటే క్యాన్సర్ రాదా?..

సపోటాలో విటమిన్ బి, సి, ఇ, పొటాషియం, మాంగనీస్, కాల్షియం, మెగ్నీషియం, తోపాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికమొత్తంలో ఉంటాయి.

Chiku

Chiku Fruit : రుచికరమైన పండ్లలో సపోట ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అధిక పోషకాలు ఉండటం వల్ల పోషకాహార నిపుణులు సైతం ఈ పండ్లు తినమని సూచిస్తుంటారు. ఈ పండులో ఉండే గుజ్జు తేలికగా జీర్ణమౌతుంది. జీర్ణ ప్రక్రియకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దీన్ని జ్యూస్ గా చేసుకుని తీసుకుంటారు. శరీరానికి తక్షణం శక్తిని ఇవ్వటంలో సపోటాను మించింది లేదు. ఇందులో ఉండే విటమిన్-A కంటి సమస్యలను తొలగిస్తుంది.

సపోటాలో ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఉన్నాయి. బలహీనంగా ఉన్నవారు ఈ సపోటాను తినటం వల్ల బలంగా తయారవుతారు. ఇందులోని ఫైబర్లు మలబద్దకం సమస్యను దూరం చేస్తాయి. అంతేకాకుండా ఒత్తిడి సమస్యతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఆహారం. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలోనూ సపోటా సహాయపడుతుంది. సపోటా ఆకులు, చెట్టు బెరడు వివిధ రకాల వ్యాధులను నయం చేయటంలో ఔషదంగా ఉపయోగిస్తారు.

సపోటాలో విటమిన్ బి, సి, ఇ, పొటాషియం, మాంగనీస్, కాల్షియం, మెగ్నీషియం, తోపాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికమొత్తంలో ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్‌ పుష్కలంగా లభించడం వల్ల ఎముకల గట్టిగా ఉంటాయి. గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు సపోటా ఎంతో మంచిది. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారంగా సూచించవచ్చు.

క్యాన్సర్ నిరోధక లక్షణాలు సపోటా కలిగి ఉంది. రోమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించటంలో సహాయపడుతుంది. సపోటాలో ఉండే మిథనాలిక్ క్యాన్సర్ కణితుల పెరుగుదలను ఆపుతుంది. కడుపులో ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి వంటి జీర్ణసంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచటంతోపాటు, ప్రకాశవంతంగా మార్చటంలో సహాయపడుతుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందించటం ద్వారా డిప్రెషన్, టెన్షన్ వంటి వాటిని సపోటా తీసుకోవటం వల్ల పోగొట్టుకోవచ్చు.