Eating Raisins : చలికాలంలో కిస్మిస్ తింటే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు దరిచేరవా?
పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఒంట్లో నీరసం తగ్గుతుంది. ఉత్సాహంగా ఉంటారు. కిస్మిస్‌లను తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : November 3, 2022 / 02:52 PM IST
Does eating raisins cause bacteria and infections in winter?
Eating Raisins : రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక ఔషధ పోషక పదార్థాలు ఈ చిన్న పండ్లలో దాగి ఉన్నాయి. కిస్మిస్‌లలో పాలిఫినాలిక్ ఫైటో పోషకాలుంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. పిల్లలకు రోజూ ఉదయాన్నే వీటిని తినడం అలవాటు చేస్తే వారి మెదడు చురుకుగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. దీనిలో ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు మంచిది. అంతేకాకుండా వీటిలోని బోరాన్ అనే ఖనిజం మూలంగా ఎముకలకు సంబంధించిన ఆస్టియో పోరోసిస్‌ను రాకుండా కాపాడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలకు ఎండు ద్రాక్ష చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. కొద్ది రోజుల్లోనే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఎండుద్రాక్షలో రాగి, విటమిన్-B పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఒంట్లో నీరసం తగ్గుతుంది. ఉత్సాహంగా ఉంటారు. కిస్మిస్‌లను తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎండు ద్రాక్ష మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎండు ద్రాక్ష జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. చలికాలంలో తీసుకోవడం చాలామంచిది. దీనివల్ల బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోలేరు. తద్వారా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు రోజువారిగా తగిన మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటిని తినటం వల్ల సంతాన సాఫల్యత మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతాయి. వీటిలోని ఫినాలిక్ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
