Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
తేనెలో కొద్దిగా పాలు, ఓట్స్ వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని మచ్చలు పడిన భాగంగా రాసుకోవాలి. దీనివల్ల సమస్య తగ్గడంతో పాటు చర్మం తాజాగా మారుతుంది.
- Guntupalli Ramakrishna
- Published On : May 25, 2022 / 08:11 PM IST
Dark Circles Under The Eye
Dark Circles : కళ్లజోడు ధరించే వారిలో చాలా మందిలో కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాగే ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు కారణంగా కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటిని తొలగించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి.
కీరదోసను గుజ్జుగా చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలో పూస్తే.. మంచి ఫలితం లభిస్తుంది. అంతేగాకుండా కీరదోస రసంలో టమోటా, బంగాళాదుంపల రసం కలిపి ముక్కుపై పట్టించి.. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మరసంలో రెండు, మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి ముక్కుకిరువైపులా రాయాలి. రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
తేనెలో కొద్దిగా పాలు, ఓట్స్ వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని మచ్చలు పడిన భాగంగా రాసుకోవాలి. దీనివల్ల సమస్య తగ్గడంతో పాటు చర్మం తాజాగా మారుతుంది. బంగాళదుంపలను సన్నగా తరిగి జ్యూస్ చేసుకోవాలి. దూదిని ఓ బంతిలా చేసి ఆ జ్యూస్‌లో ముంచాలి. కళ్లు మూసుకొని కాటన్ బాల్స్‌ను కళ్ల మీద ఉంచుకోవాలి. ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి.
రాత్రిళ్లు బాదం నూనెను ముక్కుకిరువైపులా రాసి నెమ్మదిగా మర్ధన చేయాలి. ఆల్మాండ్ ఆయిల్‌ను నల్లటి వలయాలపై రాసి మెల్లగా మసాజ్ చేయాలి. రాత్రి పూట రాసి ఉదయాన్నే నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల కళ్లజోడు పెట్టుకున్న ప్రాంతంలో ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడుతాయని బ్యూటీషన్లు అంటున్నారు.
