Dry Nuts
Dry Nuts : కాజు, పిస్త, బాదం, వాలునట్స్, పల్లీలు ఆరోగ్యకరమైన ఆహరాలు. వాటిలో వుండే అధికకెలోరీలు, కొవ్వు బరువునిపెంచే అనారోగ్యకర ఆహరాలుగా అనేకమంది అపోహపడుతుంటారు. వాస్తవానికి డ్రైనట్సు అపార పోషకవిలువలు కలిగిన ఆహారంగా చెప్పవచ్చు. వీటిని పరిమితమొతాదులో వాడకంద్వార హానికరంకాని మంచికొవ్వు, ప్రొటిన్లు, ఫైబర్లు, మినరల్సు, విటమిన్లు, యాంటియాక్సిడెంట్లు, సహజసిద్దమైన స్టిరాయిడ్సు లభిస్తాయి.
ఆరోగ్యపరిరక్షణకి డ్రైనట్స్ కీలకమనే చెప్పాలి. అయితే వీటిని నానబెట్టి తీసుకోవటం మంచిది. నానబెట్టిన వాటిలో ఫొషకవిలువలు రెట్టింపు అవుతాయి. అలా తీసుకోవడం మరింత శ్రేయస్కరం. చాలారకాల కాన్సర్లను, హృదయసంభందిత వ్యాధులను, గాల్ స్టోన్సు, ఉదరకోశ వ్యాధులను నిరోధించడానికి, గ్లూకోజు లెవల్స్, మెరుగైన మేటబాలిజానికి డ్రైనట్స్ ఉపకరిస్తాయి.
డ్రైనట్సు తీసుకోవడంద్వారా సమతుల్యమైన బరువుని సాధించుకోవచ్చు. అందుకే డైటులో ఓ భాగంగా రోజు 5నుండి6 నట్స్ ని మించకుండా తీసుకోవచ్చు. వీటిలోని యాంటియాక్సిడెంట్లు కణనిర్మాణంలో కీలకపాత్రని పోషిస్తూ, కణహీనతలనుంచి రక్షణ కల్పిస్తాయి. అది కాన్సర్ల నుంచి దూరంగా ఉంచడానికి సహయపడుతాయి.
డైనట్స్ లో E విటమిన్ కంటిచూపుని పరిరక్షిస్తాయి. మరియు ధమనులు గట్టిపడనీయకుండ మృదువుగా ఉండడానికి తోడ్పడుతాయి. వీటిద్వార లభించే కొవ్వు కొలొస్ట్రాలు లెవెల్సుని పెరగనీయవు, అందులోని ఫైబర్లు ఆకలి భావనలను దూరం చేస్తాయి. ఇవి సూక్ష్మధాతువులు అయిన మాంగనీసు, పోటాషీయం, మాగ్నీషియం, కాల్షియంలకు అపారనిధులు. అవి ఆరోగ్యపరిరక్షణలో కీలకపాత్రని పోషిస్తాయి.
చర్మాన్ని అరోగ్యవంతంగా ఉంచుతూ మృదుత్వాన్ని, లావణ్యాన్ని పెంపొందిస్తాయి. ఇందులోని B7 విటమిన్లు ఆరోగ్యవంతమైన శిరోజాలపెరుగుదలకి మరియు సంరక్షణకి ఉపకరిస్తాయి. జుట్టురాలడాన్ని తగ్గిస్తాయి. ప్రొస్టేటు క్యాన్సరువ్యాప్తిని 30% నుంచి 40% వరకు నియంత్రించడానికి సహయకారిగా పనిచేస్తాయి. స్తనసంపదని ఆకర్షణియంగా ఉంచడానికి, బ్రెస్టు క్యాన్సరువ్యాప్తిని నియంత్రించడానికి సహయపడతాయి.
మెటబాలిజక్రియని మెరుగుపరుస్తాయి, అందుకే డయాబిటిసుభాదితులు వారానికి ఓ పావుకప్పు వాలునట్సుని తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వాలునట్స్ లో ఒమెగా3ఫ్యాట్సు, విటమిన్ E లు సంవృద్దిగా ఉంటాయి. మానశిక ఆందోళనలను తగ్గిస్తాయి. రోజు తీసుకుంటే వీర్యవృద్ది జరుగుతుంది.బాదం, వాలునట్సు వాడకం రక్తపోటుని సాధరణస్తాయిలో ఉంచడానికి సహయ పడుతాయి. పల్లీలు, కాజులలోని కాల్షియం నిధులు బోనువ్యవస్థకి, మరియు గుండెకి ఎంతో మేలు కలిగిస్తాయి.
గర్భిణిగా ఉన్నపుడు బాదం పప్పులు రెగ్యులరుగా తీసుకోవడంద్వారా తల్లికి, శిశువుకి సమీకృత పోషకవిలువలను అందుతాయి. ప్రోటీన్లు శిశువులో చక్కటి కండర నిర్మాణానికి ఉపయోగపడుతాయి. ఇందులోని ఫైబర్లు తల్లిని మలబద్దకము నుంచి పరిరక్షిస్తాయి. ఇందులోని విటమిన్ A శిశువు జుట్టుపెరుగుదలకి, మృదువైన చర్మనిర్మాణానికి తోడ్పడుతుంది.
వీటిలోని మాగ్నీషియం నాడీమండల వ్యవస్థని బలోపేతం చేస్తుంది. ఇందులోని విటమిన్లు A, B1, B2, B5, B6, B9, E, మరియుK ఆరోగ్యపరిరక్షణకు దోహదం చేస్తాయి. పిల్లలో వ్యాధినిరోధకవ్యవస్థని మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లలలో నాడీవ్యవస్థ, బోనువ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థలు బలోపేతం అవుతాయి.
డ్రైనట్స్ తో చేసిన లడ్డులను పిల్లలు బాగా ఇష్టపడుతారు. వీటిని వారంలో రెండు నుంచి మూడుసార్లు పిల్లలకు ఇవ్వవచ్చు. ఈ లడ్డులలో చక్కెరకి ప్రత్యామ్నాయంగా కొద్దిగా బెల్లం, తేనె, ఎండుద్రాక్ష వాడాలి. వారంలో మూడుసార్లు డ్రైఫ్రూట్సుని రెగులర్గా తీసుకోవడం ఓ అలవాటుగా చేసుకోండి. ఈ అలవాటు ఆరోగ్యకర జీవితానికి, ధీర్గాయుస్సుకి కారణం అవుతుంది.