Eating Onions : ఉల్లిపాయలు అతిగా తింటున్నారా? అయితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచిఉన్నట్లే!

ముఖ్యంగా చాలా మందికి ఉల్లిపాయలతో అలెర్జీలు, చర్మం, తదితర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయలోని ప్రొటీన్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆస్పరాగస్, లీక్స్ లిలియాసి కుటుంబానికి చెందినవి, ఇవి అలెర్జీ క్రాస్-రియాక్టివిటీకి కారణమవుతాయి.

Eating Onions

Eating Onions : భారతీయ గృహాలలో ఉల్లిపాయ విరివిగా దొరుకుతుంది. ఇది వంటకాల్లో ప్రధానమైనది. ఉల్లిపాయ లేకుండా ఏ ఆహారాన్ని మీరు ఊహించలేరు. ఇది దేశవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడే పదార్ధం. ఉల్లిపాయ పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయదంటారు. అయితే అతిగా మాత్రం తీసుకోకూడదు. ఉల్లిపాయలు అతిగా తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ;

ఉల్లిపాయలు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ కొందరిలో మాత్రం ఉల్లిపాయలు తినడం వల్ల సమస్యలు వస్తాయి. ఉల్లిపాయలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఇది ఉబ్బరం, అలసట, పొత్తికడుపు తిమ్మిరి, పేలవమైన జీర్ణక్రియ మరియు కొంతమందిలో గుండెల్లో మంటను కలిగిస్తుంది. కొంతమందిలో చర్మం చికాకు, తామరను కలుగుజేస్తుంది.

పెద్ద మోతాదులో తినడం వల్ల కొన్ని రకాల గుండె జబ్బులకు చికిత్స చేయడానికి ఉపయోగించే రక్తాన్ని పలుచన చేసే మందులతో కలసి రియాక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉల్లిపాయలకు అలెర్జీ ఉన్న వ్యక్తులు వారి కళ్ళలో దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని అధ్యయనాలు యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నవారు ఉల్లిపాయకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. దేనికంటే ఇది గుండెల్లో మంటను పెంచుతుంది.

ముఖ్యంగా చాలా మందికి ఉల్లిపాయలతో అలెర్జీలు, చర్మం, తదితర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయలోని ప్రొటీన్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆస్పరాగస్, లీక్స్ లిలియాసి కుటుంబానికి చెందినవి, ఇవి అలెర్జీ క్రాస్-రియాక్టివిటీకి కారణమవుతాయి. అలెర్జీ సమస్యలున్నవారు ఉల్లిపాయలు తింటే సమస్య మరింత తీవ్రం కావచ్చు.

తరిగిన ఉల్లిపాయలను వినియోగించటకుండా గంటలపాటు అలాగే వదిలివేయడం వల్ల అవి విషపూరితం అవుతాయని చాలా సంవత్సరాలుగా ఈ వాదన వినిపిస్తున్నదే. దీన్ని తాజాగా కట్ చేసి వెంటనే ఉడికించాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ వాటి ఆమ్ల pH సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది కాబట్టి అవి విషపూరితంగా మారవని మరికొందరు చెబుతున్నారు. ఉల్లిపాయను కత్తిరించడం వలన సల్ఫర్ మెటాబోలైట్ ఒక రూపం లాక్రిమేటరీ ఫ్యాక్టర్ విడుదల అవుతుంది. ఇది మీ కళ్ళకు చేరినప్పుడు, అది చికాకు, ఉల్లిపాయల కన్నీటి-ప్రేరేపిత ప్రభావాన్ని కలిగిస్తుంది. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల నోరు తాత్కాలిక దుర్వాసన వస్తుంది.