కరోనా భయంతో పెరుగుతున్న కార్ల విక్రయాలు
- Subhan
- Published on- June 1, 2020 / 03:29 AM IST
లాక్‌డౌన్ కారణంగా కుదేలైన ఆటోమొబైల్ ఇండస్ట్రీ రెట్టింపు వేగంతో ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది. బేసిక్ మోడల్ కొత్త కార్లు, లేదా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేందుకు వినియోగదారులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి నగరవాసులు ముందస్తు జాగ్రత్తగా మాస్కులతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. భారీ ట్రాఫిక్ ఉన్న సమయంలో రోడ్ల మీదకు వస్తే.. పక్కపక్కనే ఉంటూ ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
వీటన్నిటి నుంచి సేఫ్ గా ఉండటానికి ఫోర్ వీలర్ వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే బేసిక్ మోడల్ కార్లతో పాటు, తక్కువ ధరకు అందుబాటులో ఉండే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. షేరింగ్ ప్రయాణాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు బ్రేక్ చెప్పేసి.. కార్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు టూ వీలర్ వాడే వారంతా ఒకేసారి ఫోర్ వీలర్ హై ఎండ్ మోడల్స్ జోలికి పోకుండా పాత కార్ల వాడాలనుకుంటున్నారట.
ఈ కొద్ది రోజుల్లోనే వీటికి డిమాండ్ పెరిగిపోతుంది. ‘కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఆటో ఇండస్ట్రీ బాధపడిందనేది వాస్తవం. 370 కార్లు అమ్మే మాకు ఒక్కసారిగా 50శాతానికి పడిపోయి కేవలం 150 యూనిట్లు మాత్రమే అమ్మగలిగాం. ఇప్పుడు ఔట్‌లెట్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నాం. బేసిక్ లెవల్ కార్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. భవిష్యత్‌లో మరిన్ని అమ్మకాలు జరుగుతాయని అనుకుంటున్నాం’ అని తల్వార్ గ్రూప్ అండ్ ఛైర్మన్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్, తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సరాల్ తల్వార్ అంటు్నారు.
తరచుగా మెట్రోలో ప్రయాణించే రాజేందర్ అనే ఐటీ ఎంప్లాయ్.. సొంత వాహనం కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నాడు. ‘ఎప్పుడూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కే ఇంట్రస్ట్ చూపించేవాడ్ని. ఈ మహమ్మారి నా ఆలోచన మొత్తం మార్చేసింది. పర్సనల్ వెహికల్ తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుందని అనుకుంటున్నా. వైరస్ నుంచి కాపాడుకోవడానికి.. ఏదైనా బేసిక్ మోడల్ కార్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నా’ అని అంటున్నాడు.
లోన్ ఆఫర్లు:
ఎంట్రీ లెవల్ కార్లకు రూ.2.92లక్షల నుంచి రూ.6.9లక్షల వరకూ ఖర్చు అవుతుంది. దానికి కనీసం 8శాతం వడ్డీ వేసుకున్నా.. నెలకు రూ.9వేల 150 నుంచి రూ.21వేల 662 వరకూ మూడేళ్లలో అప్పు తీరిపోతుంది. ఈ సమయంలో చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఫైనాన్స్ స్కీలు కూడా స్టార్ట్ చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వీటిలో మూడు నెలల మారటోరియం కూడా ఉంది.
Read: యంగ్ ప్రొఫెషనల్స్‌కు ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఎందుకు సవాళ్లుగా మారిందంటే?
