Man's Hand Holding Excessive Belly Fat, Overweight Concept.
Abdomen Fat : వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఇది ఎక్కువ. స్త్రీలకు ఇది పెద్ద సమస్యగానే పరిణమిస్తుంది శరీరాకృతినే మార్చేస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది. గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది.
జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం వల్ల పొట్ట చుట్టూ కొవ్వులను కరిగించుకోవచ్చు. నడుం చుట్టుకొలత ను బట్టి పొట్ట భాగంలో కొవ్వులు ఏస్ధాయిలో ఉన్నాయో చెప్పవచ్చు. కొంత మందిలో వంశపారంపర్యంగా ఈ కొవ్వు సమస్య రావచ్చు. ముఖ్యంగా స్త్రీలలో మోనోపాజ్ తరువాత పొట్ట చుట్టూ కొవ్వులు వేగంగా పేరుకోవటాన్ని గమనించవచ్చు.
పొట్టు చుట్టూ పేరుకున్న కొవ్వులు తగ్గించుకోవటానికి రోజూ వ్యాయామం చేయటం ఉత్తమమైన మార్గం. వ్యాయామాలూ పొట్ట తగ్గటానికి ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఆహార పదార్థాలు తినేటప్పుడు సంతృప్త కొవ్వులకు బదులు పాలీ అసంతృప్త కొవ్వులు ఉండేవి ఎంచుకోవాలి. పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తక్కువ తినటంతో పాటు కేలరీలనూ తక్కువగా తీసుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు.
గుడ్డులోని తెల్లసొన , అన్ని రకాల పండ్లు , పచ్చిగా తినగలిగే కాయకూరలు , ఆవిరిమీద ఉడికే కాయకూరలు , యాపిల్ పండ్లు , కాల్సియం ఎక్కువగా ఉండే పాలు , పెరుగు , మజ్జిక , రాగులు వంటి ఆహారాలను తీసుకోవాలి. ఉప్పును తగ్గించి తీసుకోవాలి. శరీరములో నీటిని , కొవ్వును నిలవ చేసే గుణము ఉప్పులో ఉంది. బరువు తగ్గాలని ఆహారము తీసుకోవడము మానేస్తారు. ఇలా చేయటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. మంచి పోషక పదార్ధాలను తీసుకోవటంతోపాటు, ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. జీవ పక్రియ మెరుగయ్యేందుకు నీరు బాగా తాగాలి. దీని వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.