Seeds Be Roasted : అవిసె గింజలు, గుమ్మడి గింజలను వేయించకుండా ఎందుకు తినకూడదో తెలుసా ?

గింజలు, విత్తనాలను సరైన నిష్పత్తిలో , సరైన పద్ధతిలో తింటే, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. అవిసె గింజలు, చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లో అధికంగా ఉంటాయి, లిగ్నన్‌లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

Seeds be roasted

Seeds Be Roasted : గింజలు, విత్తనాలు ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన సూపర్ ఫుడ్స్. దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడంలో వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. విత్తనాలు సూక్ష్మపోషకాలతో నిండిఉంటాయి. ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, బహుళఅసంతృప్త కొవ్వులు కలిగి ఉంటాయి. మొత్తం ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉంటాయి.

READ ALSO : Sabja Seeds : కండరాలు, ఎముకలను బలోపేతం చేయటంతోపాటు, దీర్ఘకాలిక వ్యాధులను నివారించే సబ్జా గింజలు!

గింజలు, విత్తనాలను సరైన నిష్పత్తిలో , సరైన పద్ధతిలో తింటే, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. అవిసె గింజలు, చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లో అధికంగా ఉంటాయి, లిగ్నన్‌లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అయితే జనపనార విత్తనాలు శాఖాహార ప్రోటీన్‌కు మంచి మూలం. అన్నిరకాల ప్రయోజనాలను పొందాలంటే వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. వాటిని సరైన మోతాదులో తీసుకుంటున్నారో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.

పోషకాహార నిపుణురాలు జూహీ కపూర్ తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అవిసె గింజలు, నువ్వులు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఫైబర్, లిగ్నన్స్ మరియు యాంటీ-న్యూట్రియంట్‌లను కలిగి ఉంటాయని స్పష్టం చేశారు. అదే క్రమంలో వాటిని బాగా వేయించిన తరువాత మాత్రమే తీసుకోవాలని లేకుంటే కొన్ని రకాల ఆరోగ్యపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు.

READ ALSO : Rajma Seeds : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటంతోపాటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే రాజ్మా గింజలు !

అవిసె గింజలు, గుమ్మడి గింజలతో పాటు ఇతర గింజలను వేయించకుండా తీసుకుంటే ;

వేయించకుండా గింజలను తీసుకోవటం వల్ల జీర్ణం కాకపోవచ్చు. అజీర్ణం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేయించని, లేదంటే నానబెట్టని ముడి విత్తనాలు జీర్ణక్రియను క్లిష్టతరం చేస్తాయి. ముడి విత్తనాలు ఖనిజాలు, విటమిన్‌లకు కట్టుబడి ఉండే ఫైటేట్‌లను కలిగి ఉంటాయి. ప్రతిరోజూ విత్తనాలను తీసుకోవాలనుకుంటే కొన్ని ఉత్తమమైన మార్గాలను పోషకాహార నిపుణురాలు జూహీ కపూర్ సూచిస్తున్నారు.

అవేంటంటే ఏగింజలకు ఆగింజలను ప్రత్యేకంగా విడివిడిగా వేయించటం మంచిది. అన్ని గింజలను కలిపి ఒకే బాణాలిలో వేసి వేయించటం ఏమాత్రం సరైంది కాదు. పోషకాలు చెక్కుచెదరకుండా ఉండాలంటే అవిసె వంటి గింజలను తక్కువ మంటలో వేయించుకోవటం మంచిది.

READ ALSO : Flax Seeds : శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించే అవిసెగింజలు!

వేయించిన తరువాత వాటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. అవసరమనుకుంటే వేయించిన తరువాత వాటిని బాగా గ్రైండ్ చేసి పొడిగా మార్చుకోవాలి. అలాకాకుంటే విత్తనాలను నానబెట్టుకుని రుబ్బుకోవటం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.