Migraine Pain : మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు, జాగ్రత్తలు!

నిద్ర లేమి వల్ల మైగ్రేన్‌ వస్తుంది. అందువల్ల రోజూ ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించాలి. లావెండర్‌ ఆయిల్‌కు కూడా నొప్పిని తగ్గించే గుణం ఉంది. దీనిని తలకు అప్లై చేయటం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

Migraine Pain : తలలోని రక్తనాళాల మీద ఒత్తిడితో మొదలయ్యే సమస్యనే మైగ్రేన్ నొప్పిగా చెప్పవచ్చు. నిద్రలేమి, డిప్రెషన్‌, ఎక్కువసేపు ఎండలో ఉండడం, మహిళల్లో హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే వారిలో ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ప్రయాణాలు చేసేవారు, వంశపారంపర్యంగా కూడా ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి. మైగ్రేన్ నొప్పి వస్తే ముఖ్యంగా తలనొప్పి ఓ వైపు మాత్రమే ఉండడం, చీకాకు, మానసిక స్థితి సరిగా ఉండకపోవడం, వాంతి చేసుకోవడం, వాంతి వస్తున్న భావనకు గురికావడం, కంటిచూపు సరిగా ఉండకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎమ్మారై,సిటి స్కాన్‌, రక్తపరీక్షలు, ఇఇజి స్కాన్‌తో సమస్యను నిర్థారించుకోవచ్చు. ఈ సమస్యకు పూర్తి చికిత్స లేకపోయినా, ఉపశమనానికి చికిత్సలు ఉన్నాయి.

మైగ్రేన్ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు :

పుదీనా ఆకుల్లోని మెంథాల్‌, మెంథోన్‌ మైగ్రేన్‌ నియంత్రణకు బాగా ఉపయోగపడుతాయి. అల్లంలోని జింజెరోల్స్‌కు ఔషధ గుణం మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్‌ ప్యాక్‌ పెట్టుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. కెఫెన్‌కు ఔషధీయ గుణాలున్నాయి. పార్శ్వపు నొప్పి ఎక్కువగా ఉంటే వారంలో రెండు రోజులు కెఫెన్‌ తీసుకోవచ్చు. మెగ్నీషియం ఉండే ఆహారాన్ని తీసుకుంటే అన్ని రకాల పార్శ్వపు నొప్పులూ తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయికి పడిపోతే హైపోగ్లైసీమియా సంభవించవచ్చు. అది మైగ్రేన్ నొప్పిగా మారవచ్చు. దీనికి ఉత్తమ ఆహారం అరటిపండు. మెగ్నీషియం అధికంగా ఉండే ఈ పండు తినడం వల్ల మీకు చాలా త్వరగా శక్తి లభిస్తుంది. మైగ్రేన్ జీర్ణ సమస్యలు లేదా ఇతర కడుపు సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో రిబోఫ్లేవిన్ అధికంగా ఉండే పుట్టగొడుగులు, గుడ్లు లేదా గింజలు వంటి ఆహారాలను చేర్చుకోవాలి.

కంటినిండా నిద్ర, మానసిక ప్రశాంతత ;

నిద్ర లేమి వల్ల మైగ్రేన్‌ వస్తుంది. అందువల్ల రోజూ ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించాలి. లావెండర్‌ ఆయిల్‌కు కూడా నొప్పిని తగ్గించే గుణం ఉంది. దీనిని తలకు అప్లై చేయటం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఎండలో ఎక్కువ తిరిగినా, భోజనం చేయడంలో ఆలస్యమైన లేక తినకపోయినా నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ఈ తలనొప్పి రావొచ్చు. ఇక ఈ తలనొప్పికి మరో ముఖ్యం కారణం ఒత్తిడికి గురవ్వడం, అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాన్నీ అదే పనిగా ఆలోచించడం, మానసిక ఆందోళన తగ్గించుకోవాలి. కాంతి లేనిచోట , నిశ్శబ్దం ఉన్న ప్రాంతంలో ప్రశాంతంగా నిద్రపోయిన ఉపశమనం లభిస్తుంది. నిద్రపోవడం, యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి అనుసరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు